వైభవంగా కోటి దీపోత్సవం

ABN , First Publish Date - 2020-11-30T05:50:13+05:30 IST

యాగంటి క్షేత్రంలో ఆదివారం కార్తీక పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని కోటి దీపోత్సవం నిర్వహించారు.

వైభవంగా కోటి దీపోత్సవం
నంద్యాలలో దీపాలు వెలిగిస్తున్న దృశ్యం


బనగానపల్లె, నవంబరు 29:  యాగంటి క్షేత్రంలో ఆదివారం కార్తీక పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని కోటి దీపోత్సవం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా  ఉదయం 5 గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు, సహస్ర నామావళి, ఉచిత ప్రసా ద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.  ఆలయంలో  కోటి దీపోత్సవ కార్యక్రమం  ఆలయ ఈవో డీఆర్‌కెవి ప్రసాద్‌ పర్యవేక్షణలో  నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఉమామహేశ్వరమ్మ దంప తులు ఆలయంలోని  ఉమామహే శ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమామహేశ్వర నిత్యాన్నదానసంస్థ ఉపాధ్యక్షుడు దస్తగిరి రెడ్డి, ఆలయ పూజారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.   


  మండలంలోని  నందవరం చౌడేశ్వరీమాత ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఆదివారం  ఆలయ ఈవో రామానుజన్‌, ఆలయ చైర్మన్‌ పీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి సహస్ర దీపాలం కరణ  కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా  నిర్వహించారు. ఈ సందర్భం గా అమ్మవారికి ఊయల సేవ   నిర్వహించారు.  


మహానందిలో భక్తుల రద్దీ:

మహానంది:  మహానంది శైవక్షేత్రం కార్తీక పౌర్ణమి భక్తులతో ఆదివారం కళకళలాడింది. ఈసందర్బంగా ప్రధాన ఆలయాల్లో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ వేలాదిమంది భక్తులు పూజలు నిర్వహించారు. కాగా కార్తీక మూడో సోమవారం క్షేత్రంలో మరింత భక్తుల రద్దీ ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  పాణ్యం సీఐ జీవన్‌గంగనాద్‌బాబు, ఎస్‌ఐ ప్రవీణ్‌కు మార్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు మామిళ్ళపల్లి అర్జునశర్మ, దేవస్దానం ఏఈఓ ధనుంజయ, సూపరిడెంట్‌ ఓంకారం వెంకటేశ్వర్లు, నాగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ హరినాద్‌, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారెడ్డి, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.


చాగలమర్రి: మండల కేంద్రంలోని రామలింగేశ్వర ఆలయంలో కార్తీకపౌర్ణమి సందర్భంగా   జ్వాలా తోరణం కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. వేద పండితుడు సుబ్బయ్య, ప్రసాద్‌,  ఆలయ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జ్వాలా తోరణం వెలిగించి ఉత్సవమూర్తులకు  పల్ల కి మహోత్సవం నిర్వహించారు.  ఆలయ కమిటీ సభ్యులు దామోదర్‌, శ్రీనివాసగౌడ్‌, మాజీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఆలయ అధ్యక్షుడు కొండయ్య పాల్గొ న్నారు. 


ఆళ్ల్లగడ్డ: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం కార్తీక పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని ఉత్సవమూర్తులకు విశేషపూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, మఠం మేనేజర్‌ వైకుంఠస్వామి తెలిపారు.   ఉత్సవమూర్తులను పూలమాలలతో అలంకరించి పూజలు చేశామన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. 


నంద్యాల (కల్చరల్‌):  నంద్యాలలో పలు ఆలయాలలో కార్తీక మాసం పౌర్ణమి ఆదివారం పురష్కరించుకొని సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు, జ్వాలా తోరణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సంజీవనగర్‌ కోదండరామాలయంలో భగవత్‌ సేవసమాజ్‌ కమిటీ అధ్యక్షులు సముద్రాల సూర య్య, గాయత్రీమాత ఆలయంలో బ్రహ్మణ సేవాసమాఖ్య మహిళలలు రేణుక,శైలజల ఆధ్వర్యంలో, విజయగణపతి, ఉమామహేశ్వర దేవస్థానంలో ధర్మజాగర ణ సమితి ఆధ్వర్యంలో కోజాగిరి ఉత్సవాలు, చిత్తలూరి వారివీధిలోని శ్రీక్రిష్ణమందిరంలో సముద్రాల పాండురంగయ్య, స్థానిక అమ్మవారిశాలలో అధ్యక్షుడు భవనాశి వాసు ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం, మూలమఠంలో రెడ్ల సేవాసంఘం ఆధ్వర్యంలో, తదితర ఆలయాలలో వైభవంగా సహస్ర దీపాలంకరణ సేవ-జ్వాలా తోరణం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మణ సేవా సమాఖ్య నిర్వాహకులు సుధీర్‌, భగవత్‌ సేవాసమాజ్‌ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌, శరణా చక్రపాణి, పార్థసారథిక్రిష్ణ, డాక్టర్‌ గెలివి సహదేవుడు, వాసు, మోహన్‌ గుప్త, భక్తులు పాల్గొన్నారు. 


  మహారుద్రయాగం చేయడం వలన పంచ భూతాలు శుద్ధి అవుతాయని పాములేటి స్వామి పేర్కొన్నారు.  నంద్యాల అమ్మస్పటికలింగేశ్వరాలయంలో కార్తీక మాస పౌర్ణమి పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.  ఈ హోమంలో  ఉద్భవించే ధూమం వల్ల కరోన లాంటి భయంకరమైన వైరస్‌ క్రిములు   నశిస్తాయని పాములేటి స్వామి తెలిపారు.  


 పాణ్యం : మండలంలోని  కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో ఆదివారం కావడంతో పలు ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.  ఆలయ ఈఓ రామకృష్ణ  భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.  ఆలయ అన్న సత్రంలో  భక్తులకు ఆహార పొట్లాలు అందజేశారు.  


కొలిమిగుండ్ల: కొలిమిగుండ్ల లలితా సుందరేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం మహిళలు కార్తీక దీపోత్సవం నిర్వహించారు. మహిళలందరూ ఆలయం ప్రాంగణంలో దీపాలు వెలిగించారు.  


 కొత్తపలి: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కొలను భారతి పుణ్యక్షే త్రానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుండి భక్తులు రావడంతో ఆలయ  ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో ఆదేశాల మేరకు పురోహితులు ప్రాతః కాల సమయంలో ఆలయాన్ని సంప్రోక్షణ గావించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు.   ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత పౌర్ణమి ప్రవేశించడంతో  సుమారు 1500 మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. భక్తులకు వాసవీ సత్ర నిర్వాహకులు అన్నదానం చేశారు.   

Updated Date - 2020-11-30T05:50:13+05:30 IST