పంటలు నీట మునిగి...ఆర్థిక ఇబ్బందులతో..ఉరేసుకుని రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-10-28T10:17:29+05:30 IST

భారీ వర్షాలకు సాగు చేసిన పంటలు దెబ్బతినటం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

పంటలు నీట మునిగి...ఆర్థిక ఇబ్బందులతో..ఉరేసుకుని రైతు ఆత్మహత్య

ధారూరు : భారీ వర్షాలకు సాగు చేసిన పంటలు దెబ్బతినటం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక  రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ధారూరు మండలం అంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన  రైతు ఆలేటి మల్లేషం (39)కు నాలుగెకరాల పొలం ఉంది. మరో నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని  పత్తి, వరి సాగు చేశాడు. చేతికొచ్చిన పంటలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. సహకార బ్యాంకులో రూ.లక్షతో పాటు ఇతరుల వద్ద సాగు కోసం  చేసిన అప్పులు  ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందాడు. మంగళవారం సాయంత్రం పొలానికి వెళ్లిన మల్లేషం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. గమనించిన చుట్టు పక్కల రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ కోటేశ్వరరావు ఘటనాస్థలానికి వచ్చి పంచ నామా నిర్వహించారు. పంటలు దెబ్బతినడంతో ఆత్మహత్య చేసుకు న్నాడని ఎస్‌ఐ వివరించాడు. మృతుడి సోదరుడు బిచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-28T10:17:29+05:30 IST