పంటల బీమా నగదు పొందేందుకు 20వ తేదీ వరకు గడువు: ఏడీఏ

ABN , First Publish Date - 2021-04-17T05:20:07+05:30 IST

రాజమహేంద్రవరం వ్యవసాయశాఖ డివిజన్‌ పరిధిలో రాజమహేంద్రవరం రూరల్‌, కడియం, రాజానగరం మండలాల్లోని వరి పండించే రైతులు పంటల బీమా నగదు పొందడానికి ఈనెల 20వ తేదీలోగా బయోమెట్రిక్‌ విధానం ద్వారా వేలిముద్రలు వేసుకోవాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ఎ.సావిత్రి తెలిపారు.

పంటల బీమా నగదు పొందేందుకు 20వ తేదీ వరకు గడువు: ఏడీఏ

రాజమహేంద్రవరం రూరల్‌/రాజానగరం, ఏప్రిల్‌ 16: రాజమహేంద్రవరం వ్యవసాయశాఖ డివిజన్‌ పరిధిలో రాజమహేంద్రవరం రూరల్‌, కడియం, రాజానగరం మండలాల్లోని వరి పండించే రైతులు పంటల బీమా నగదు పొందడానికి ఈనెల 20వ తేదీలోగా బయోమెట్రిక్‌ విధానం ద్వారా వేలిముద్రలు వేసుకోవాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ఎ.సావిత్రి తెలిపారు. వరి రైతులకు ఖరీఫ్‌ 2020 పంట కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిందన్నారు. అర్హులైన రైతులకు ఈనెలలో పంటల బీమా మొత్తం ఆధార్‌లింక్‌ ద్వారా రైతుల ఖాతాలకు జమవుతుందన్నారు. గ్రామంలో ఉన్న రైతుభరోసా కేంద్రాలు వ్యవసాయ, ఉద్యాన సహాయకుల ద్వారా వేలిముద్రలు వేసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం సబ్‌డివిజన్‌ పరిధిలో రాజమహేంద్రవరం రూరల్‌, కడియం, రాజానగరం మండలాలకు సంబంధించి సుమారు 15,138 మంది రైతులకు పంటల బీమా పథకానికి లబ్ధిదారులుగా ఉన్నారని ఏడీఏ తెలిపారు. పంటల బీమా పథకాన్ని అర్హులైన రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని రాజానగరం మండల వ్యవసాయాధికారి పల్లా సురేష్‌ చెప్పారు.

Updated Date - 2021-04-17T05:20:07+05:30 IST