ఆరుతడే శ్రేయస్కరం

ABN , First Publish Date - 2021-10-18T04:48:34+05:30 IST

వరి వద్దు. ఆరు తడి ముద్దు. ఇదీ గత నెల రోజులుగా వ్యవసాయాధికారులు చేస్తున్న ప్రచారం. ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడం.. ఈదిశగా ఆదేశాలు జారీ చేయడంతో వ్యవసాయాధికారులు అన్నదాతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏఈవో నుంచి జిల్లా వ్యవసాయాధికారి వరకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా వరి సాగు చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి యాసంగిలో ఇతర పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు. రైతు వేదిక భవనాల్లోనూ అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఆరుతడే శ్రేయస్కరం
రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయశాఖాదికారి అభిమన్యుడు(ఫైల్‌)

యాసంగిలో వరి సాగు వద్దు

వ్యవసాయాధికారుల విస్తృత ప్రచారం

రైతువేదికల్లో అన్నదాతలకు అవగాహన

బూర్గంపాడు, అక్టోబరు 17: వరి వద్దు. ఆరు తడి ముద్దు. ఇదీ గత నెల రోజులుగా వ్యవసాయాధికారులు చేస్తున్న ప్రచారం. ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడం.. ఈదిశగా ఆదేశాలు జారీ చేయడంతో వ్యవసాయాధికారులు అన్నదాతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏఈవో నుంచి జిల్లా వ్యవసాయాధికారి వరకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా వరి సాగు చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి యాసంగిలో ఇతర పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు. రైతు వేదిక  భవనాల్లోనూ అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు.

53 వేల ఎకరాల్లో వరి సాగు

నియోజకవర్గంలో రైతులు వానాకాలంలో 53వేల 969 ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇందు లో వ్యవసాయ శాఖ అధికారులు వేసిన అంచనా ప్రకారం.. కరకగూడెం మండలంలో 12,337 ఎకరాలు, పినపాక మండలంలో 13,590, మణుగూరు మండలంలో 7,178, అశ్వాపురం మండలంలో 7,985, బూర్గంపాడు మండలంలో 6,431, గుండాల మండలంలో 2,889, ఆళ్ళపల్లి మండలంలో 3,556 ఎకరాలతో నియోజక వర్గంలో 53,969 ఎకరాలు వరి సాగయింది. ఈ విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు రబీలో ధాన్యం విత్తనాలు మార్కెట్‌లోకి విడుదల చేయకుండా కంపెనీలను ప్రభుత్వం నిలువరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిం దని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం

పునాస సీజన్‌లో వర్షాలు సమృద్దిగా కురవడంతో చెరువులు, వాగులు, వంకలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. పైగా విద్యుత్‌ కూడా సక్రమంగా ఉండటంతో రైతులు వరిపంటను గణనీయంగా సాగు చేస్తున్నారు. వానాకాలం, యాసంగిలో దిగుబడి కూడా గణనీయంగా పెరిగిందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం కూడా ఐకేపీ, సోసైటీల ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేసింది. ఆ ధాన్యం గోదాముల్లో నిల్వ ఉండటంతో సాగు తగ్గించాల ని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు వరి సాగు పెరగడంతో అపరాలు, నూనెగింజలు, కూరగాయల పంటల సాగు భారీగా తగ్గుతోంది. వినియోగం పెరుగుతుండటంతో దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. డిమాండ్‌ పెరుగుతుండటంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం అపరాలు, నూనె గింజల పంటలను సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తోంది. మరోపైపు వరి సాగు కూడా రైతులకు భారీగా పరిణమిస్తోంది. డిజీల్‌, కూలీలు, ఎరువుల ధరలు పెరగడంతో రైతులకు అశనిపాతంగా మారింది. మరోవైపు రికార్డు స్థాయిలో పెరిగిన దిగుబడితో యాంగిలో మిల్లర్లు అడ్డగోలుగా కోత విధించా రు. ఒక్కో రైతు రూ. వేలల్లో నష్టపోయారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

అపరాల పంటలు సాగు చేయాలి

శంకర్‌, మండల వ్యవసాయాదికారి

రైతులు యాసంగిలో వరి పంట కాకుండా అపరాలు సాగు చేయాలి. ప్రధానంగా కందులు, పెసర, మినుములు, కూరగాయాలను సాగు చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. మార్కెట్‌లో ధర కూడా బాగుంది. వరి సాగు వల్ల మిగతా పంటల విస్తీర్ణం పడిపోయింది. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని ప్రభుత్వం చెప్పింది.


Updated Date - 2021-10-18T04:48:34+05:30 IST