రైతులకు పంట రుణాలు సకాలంలో ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-06-24T05:47:42+05:30 IST

బ్యాంకర్లు పంట రుణాలను రైతులకు సకాలంలో అందజేయాలని అదనపు కలెక్టర్‌ పద్మజారాణి అన్నారు.

రైతులకు పంట రుణాలు సకాలంలో ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ పద్మజారాణి

అదనపు కలెక్టర్‌ పద్మజారాణి 

సూర్యాపేట అర్బన్‌, జూన్‌ 23: బ్యాంకర్లు పంట రుణాలను రైతులకు సకాలంలో అందజేయాలని అదనపు కలెక్టర్‌ పద్మజారాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎల్‌డీఎం జగదీష్‌చంద్రబోస్‌తో కలిసి బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడా రు. 2020-21 వార్షిక సంవత్సరంలో లక్ష్యం రూ. 3448.18 కోట్లు ఉండగా రూ. 3648.93 కోట్లు రుణాలు మంజూరు చేశామన్నారు. జిల్లాలో వివిధ బ్యాంకుల నుంచి ఆయా యూనిట్లు రుణాల మం జూరు కాగా రుణాలకు సంబంధించిన సబ్సిడీ సంబంధిత బ్యాం కులు చెల్లించాయని సూచించారు. మండలాల వారీగా వివిధ రం గాల్లో అందజేసిన రుణాల వివరాలను ఎప్పటికప్పుడు అందిం చాలని, రికవరీ కమిటీలను నియమించాలని బ్యాంకు అధికారులకు సూచించారు. 2021-22 వార్షిక ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో నాబార్డ్‌ డీడీఎం సత్యనారాయణ, ఎస్‌బీఐ ఏజీఎం కృష్ణమోహన్‌, మోహన్‌ప్రసాద్‌, శ్రీనివాస్‌ ఉన్నారు. 

Updated Date - 2021-06-24T05:47:42+05:30 IST