Abn logo
Jun 19 2021 @ 23:15PM

పంట రుణాలు సకాలంలో అందించాలి : ఆర్డీవో

అధికారులతో సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో ప్రసన్నలక్ష్మి

జంగారెడ్డిగూడెం, జూన్‌ 19 : పంట రుణాలను సకాలంలో అందించాలని ఆర్డీవో ప్రసన్నలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో తహ సీల్దార్లు, వ్యవసాయాధికారులు, బ్యాంక్‌ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. డివిజన్‌ పరిధిలో 10743 పంట సాగు హక్కు పత్రాలకు రూ.8595లక్షలు రుణాలు ఇవ్వాలన్నారు. ఐదుగురు రైతులను గ్రూపుగా ఏర్పాటు చేసి సకాలంలో రుణాలు అందజేయాలన్నారు. కేఆర్‌పురం ఇన్‌చార్జ్‌ ఏడీఏ కేవీఎన్‌ పోశారావు, డివి.న్‌ పరిధిలో తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.