పంట రుణ పరిమితి ఖరారు

ABN , First Publish Date - 2022-01-27T06:23:34+05:30 IST

యాసంగి పంటల సాగుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే రుణపరిమితి ఖరారైంది. ఏటా మార్పులు, చేర్పులుచేసే రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటి,జిల్లా కమిటి ప్రతిపాదనల క్రమంలో పంటరుణాన్ని ఖరారు చేసింది.

పంట రుణ పరిమితి ఖరారు

- ఉద్యాన, కూరగాయ పంటలకు ప్రాధాన్యం

- సాగు వ్యయం ఆధారంగా నిర్ణయం

- మిద్దె తోటలకు అందించనున్న వైనం

కామారెడ్డి, జనవరి 26: యాసంగి పంటల సాగుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే రుణపరిమితి ఖరారైంది. ఏటా మార్పులు, చేర్పులుచేసే రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటి,జిల్లా కమిటి ప్రతిపాదనల క్రమంలో పంటరుణాన్ని ఖరారు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు లిమిటెడ్‌(టెస్కాబ్‌) ఆధ్వర్యంలో రాష్ట్ర సాంకేతిక కమిటి (ఎస్‌ఎల్‌టీసీ) రుణ ప్రణాళికను తయారుచేసి నాబార్డు, వ్యవసాయశాఖకు పంపించింది. సదరు నివేదిక ఆధారంగా నాబార్డు, వ్యవసాయశాఖకు పంపించింది. సదరు నివేదిక ఆధారంగా నాబార్డు వ్యవసాయరుణ ప్రణాళికను ఖరారుచేసింది. ఆ ప్రతిపాదిక ప్రకారం బ్యాంకులు రైతులకు పంట రుణాలు మంజూరు చేయనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 70 రకాల పంటలు సాగవుతాయని సాంకేతిక కమిటి అంచనావేసింది. రాష్ట్రంలో సగటు పంటల సాగు వ్యయంఆధారంగా రుణపరిమితిని నిర్దేశించింది. పత్తి, వరి,మొక్కజొన్న,కంది, పెసర, శనగ, వేరుశనగ, సోయాబిన్‌, మిరప, పసుపు, ఉల్లి తదితర ప్రధాన రకాల పంటలకు ఎకరా ఇవ్వనుంది. సాగు వసతి లేని ప్రాంతాల్లో రుణపరిమితిని వేరువేరుగా రూపోందించింది. నీటి సదుపాయం ఉన్నచోట కొంత మొత్తం అధికంగా నీరులేని ప్రాంతాల్లో పండించే పంటలకు అత్యల్పంగా రుణం అందించనుంది.

ఉద్యాన పంటలకు

ఇప్పటివరకు కూరగాయాలకు రుణసౌకర్యం కల్పించిన ప్రభుత్వం తాజాగా అన్ని పంటలకు వర్తింపజేశారు. కొళ్లు, పందులు,మేకలు, గొర్రెల పెంపకానికి ప్రత్యేకంగా పరిమితిని ఖరారుచేశారు. మామిడి, బొప్పాయి, కొబ్బరితోట, కోకో తోట, బత్తాయి,సపోట, సీతాఫలం, కర్బూజ, పుచ్చకాయ,దానిమ్మ, జామ,నిమ్మ, అరటి, గులాబీ తోటలు,మల్లెతోట వంటి ఉద్యానపంటలకు రుణ సౌకర్యం కల్పించారు. పౌలి్ట్రకి సంబంధించి బాయిలర్‌ కోళ్లకు కోడికి రూ.140-150,లేయర్స్‌ కోడికి రూ.300-310, ఆవులు, గేదెలు రూ. ఒక్కొ జీవనాకి రూ.21-23 వేలవరకు రుణం ఇవ్వనున్నారు.

పందిరి తోటలకు ఏడాదికి మూడు సార్లు రుణం

సేంద్రియ కూరగాయలను ప్రోత్సహించేందుకు రుణాలు ఇవ్వాలని కమిటి నిర్ణయించింది. పందిరి తోటలలో కూరగాయాలు పండించుకుంటే వారికి ఏటా మూడు సార్లు రుణం ఇవ్వనున్నారు. తోలిపంటలకు రూ.10,500 ఇచ్చి అవిచెల్లిస్తే రూ.21 వేలు, మూడుసారి రూ.31,500 ఇవ్వనున్నారు. జిల్లా కమిటి ప్రతిపాదనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో ఈ తరహ పంటలు పెంచుతున్నారు. రుణసౌకర్యంతో సాగుచేసేవారి సంఖ్య భారిగా పెరుగనుంది.


- పంటల వారిగా ఎకరకు గరిష్టంగా

పత్తి        45 వేలు

వరి         40 వేలు

మొక్కజొన్న   28 వేలు

జొన్నలు      18 వేలు

శనగ         14 వేలు

కంది         22 వేలు

పెసర        12 వేలు

ఆముదం     15 వేలు

చెరుకు       75 వేలు

నువ్వులు     15వేలు

గోదుమలు   15వేలు

పొద్దుతిరుగుడు 22వేలు

ఉల్లి           44వేలు

పసుపు         75వేలు

సోయాబిన్‌      24వేలు

వేరుశనగ       26వేలు

అల్లం          63వేలు

మల్బరీ         50వేలు

పశుగ్రాసం      13వేలు

వరి(విత్తనోత్పత్తి) 45వేలు

మొక్కజొన్న(విత్తనోత్పత్తి) 32వేలు


Updated Date - 2022-01-27T06:23:34+05:30 IST