ముంపులో పంట పొలాలు

ABN , First Publish Date - 2021-09-07T14:04:59+05:30 IST

డ్రెయినేజీ శాఖ అధికారుల పర్యవేక్షణా లోపంతో..

ముంపులో పంట పొలాలు

డ్రెయినేజీ శాఖ నిర్లక్ష్యం


చుండూరు: డ్రెయినేజీ శాఖ అధికారుల పర్యవేక్షణా లోపంతో పంట భూము లు ముంపునకు గురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిమి డ్రెయిన్‌ పరిధిలోని చినపరిమి, కార్మూరువారిపాలెం, చినగాదెలవర్రు, పెదగాదెలవర్రు గ్రామ రైతులు ఈ ముంపు సమస్యను ఎదుర్కొంటున్నారు. పరిమి డ్రెయిన్‌పై అక్రమార్కులు గత వేసవిలో తమ భూములకు ఎదురుగా తూములు అమర్చి బం డ్ల బాటలుగా మార్చుకున్నారు. ఈ విధంగా డ్రెయిన్లపై పది చోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో కాల్వలో నీటి పారుదల నిలిచిపోవడంతో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట భూములు నీట మునిగాయి. ఎరువు వేసుకోవడానికి, కలుపు తీసుకోవడానికి అవకాశం లేదు. కొన్ని చోట్ల నీటి ముంపునకు వరి కుళ్లిపోతోందని రైతులు వాపోతున్నారు. వెంటనే డ్రెయినేజీ శాఖ అధికారులు ఈ కాల్వపై ఉన్న అడ్డంకులు తొలగించి మురుగు నీటి పారుదలకు, ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-09-07T14:04:59+05:30 IST