ఎ.రంగంపేటలో గజ గజ..!

ABN , First Publish Date - 2020-07-06T11:05:52+05:30 IST

చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట వద్ద.. శేషాచలం అడవుల సమీపంలో ఉన్న వరి, అరటి పంట పొలాలను గజరాజులు..

ఎ.రంగంపేటలో గజ గజ..!

వరి, అరటి పంటలను  ధ్వంసం చేసిన ఏనుగులు


చంద్రగిరి, జూలై 5: చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట వద్ద.. శేషాచలం అడవుల సమీపంలో ఉన్న వరి, అరటి పంట పొలాలను గజరాజులు ధ్వంసం చేశాయి. శనివారం అర్ధరాత్రి సమయంలో ఎ.రంగంపేట ఎస్టీ కాలనీ సమీపంలోని పొలాలపై సుమారు తొమ్మిది ఏనుగుల గుంపు పడింది. నాగరాజనాయుడు పొలానికి ఉన్న ఫెన్సింగ్‌ను, రామ్మూర్తిరెడ్డికి చెందిన వరిపంటను, మునిరెడ్డికి చెందిన అరటి తోపును ధ్వసం చేశాయి. విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికెళ్లి బాణాసంచా కాల్చి, డప్పులు వాయించి ఏనుగులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయితే అవి తిరగబడటంతో జనం భయాందోళనతో పరుగులు తీశారు. ఆదివారం సమాచారం అందుకున్న డీఎఫ్‌వో నాగార్జునరెడ్డి, ఎఫ్‌ఆర్వో పట్టాభి, డీఆర్వో కుమారస్వామిలు పొలాలను పరిశీలించారు. ఉద్యానశాఖ అధికారులు పంటలను పరిశీలించి, నష్టం అంచాలను పంపితే రైతులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే శేషాచలం అడవుల నుంచి ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు చేపడతామని చెప్పారు.

Updated Date - 2020-07-06T11:05:52+05:30 IST