గాలివానకు పంట నష్టం

ABN , First Publish Date - 2020-06-03T10:47:00+05:30 IST

జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో సోమవారం రాత్రి వర్షం కురిసింది. దీం తో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి.

గాలివానకు పంట నష్టం

వజ్రకరూరు,జూన్‌2: జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో సోమవారం రాత్రి వర్షం కురిసింది. దీం తో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తం భాలు నేలకొరిగాయి. వజ్రకరూరు మండలంలో సో మవారం రాత్రి కురిసిన వర్షానికి చేతికి వచ్చిన వరి పంట నీట మునిగింది. మండలంలోని పీసీ గ్రా మంలో కేశవనాయక్‌, కురువ పరమేష్‌ వరి పం టను సాగు చేశారు. సోమవారం కోత కోసిన వరి పంటను కుప్పలు వేయకుండా పొలంలోనే ఉంచారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి సగం పంట నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. మిగిలిన పంట నీట  మునిగింది. సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.



బ్రహ్మసముద్రం: మండలవ్యాప్తంగా సోమవా రం రాత్రి ఓ మోస్తరు వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. తొలకరి వర్షం రాకతో రైతులు సేద్యపు పనులకు సన్నద్దమవుతున్నారు. సూగేపల్లి, ఎస్‌ కోనాపురం, ముప్పలకుంట, తదితర గ్రామాల్లో భారీ వర్షం రావడంతో చెక్‌డ్యాంలతో పాటు చెరువుల్లోకి కొద్దిపాటి నీరు చేరింది. వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది.  


గుడిబండ:  మండలంలోని పీఎన్‌పాళ్యం గ్రామానికి చెందిన నంజుండప్ప కుమారుడు శివన్న సాగుచేసిన అరటితో ఈదురుగాలులకు నేలకొరిగినట్లు బాధితుడు తెలిపారు. సోమవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి అరటి తోట నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో రూ.3 లక్షల వరకునష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.  ప్రభుత్వం స్పందించి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


రామగిరి: మండలంలో సోమవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. 29మి.మీ. వర్షపాతం నమోదు కాగా, భారీగా వీచిన గాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడగా, కుంటిమద్దిలో విద్యుత్‌స్తంభాలు కూడా నేలకొరిగాయి. వర్షం తక్కువైనా గాలులు భయంకరంగా వీచడంతో ఎక్కడేమి నష్టం జరుగుతోందనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Updated Date - 2020-06-03T10:47:00+05:30 IST