Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రతి ఎకరాకు పంట నష్టపరిహారం అందించాలి


ఎమ్మెల్యే కుందురు

మార్కాపురం, డిసెంబరు 2: మండలంలో ఇటీవల తుఫాన్‌ను కారణంగా దెబ్బతిన్న ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యా ల యంలో గురువారం మండలంలోని వ్యవ సా య, ఉద్యానవన, ఆర్బీకే సిబ్బందిలతో మం డలంలో పంట నష్టపరిహారంపై సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయశాఖ పరిధిలో సు మారు 400 ఎకరాలు, ఉద్యానవన శాఖ పరి ధిలో 450 ఎకరాల మిర్చి నష్టపోయినట్లు అధి కారులు ప్రాథమిక అంచనాలు తయారు చే యడం జరిగిందన్నారు. మండలంలోని నికరం పల్లి, రామచంద్రాపురంలలో మరోమారు పంట లను సందర్శించి పంటనష్టాలను అంచనా వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ముందుగా మండలంలోని నికరంపల్లిలో అప్పులతో ఆత్మ హత్య చేసుకున్న రైతు టి.గాలిరెడ్డి భార్య అచ్యుతకు రూ.7లక్షల పరిహారాన్ని ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఏడీఏ రమాదేవి, జడ్పీటీసీ బాపనరెడ్డి, ఎంపీపీ అరుణ, ఏవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

ప్రతి రైతుకు పరిహారం 

తర్లుపాడు : వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రతి రైతుకూ నష్ట పరిహారం అందేలా చూడా లని ఎమ్మెల్యే కుందురు అధికారులను ఆదేశిం చారు. ఎంపీడీవో కార్యాలయంలో తుఫాన్‌ దా టికి దెబ్బతిన్న పంటలపై అధికారులతో, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ తుఫా న్‌కు  శనగ, మిర్చి దెబ్బతిన్నట్లు నివేదికలు వ చ్చాయన్నారు. మండలంలో 2900 శనగ పంట సాగు చేయగా 2100 ఎకరాలకు నష్టం వాటి ల్లినట్లు అధికారులు సిద్ధం చేశారు. వరి 192 ఎకరాల్లో, మినుము 60 ఎకరాల్లో నష్టం వాటి ల్లినట్లు అధికారులు తెలిపారు. మం డలంలో 2700 ఎకరాలు మిర్చి సాగు చేయగా తుఫాన్‌, తెగుళ్ల కారణంగా పూర్తిగా మిర్చి పంట దెబ్బ తిన్నట్లు అధికారులు గుర్తించార న్నారు. మిర్చి పంటకు మాత్రం ఇన్సూరెన్స్‌ పథకం వర్తిం చేలా కృషి చేస్తామన్నారు. గానుగపెంట, పోత లపాడు, తర్లుపాడులో మిర్చి పంట దెబ్బతి న్నట్లు పలువురు ప్రజా ప్రతినిధులు ఎమ్మె ల్యే దృష్టికి తీసుకొచ్చారు. కలుజు వ్వలపాడు, జగన్నాఽథపురంలో వరి, మి నుపు పంట పూర్తిగా దెబ్బ తిన్నప్పటికీ అధికారులు పంట నమోదు చేయకుండా నిర్లక్ష్యధోరణి అవలంబి స్తు న్నారని ఆ గ్రామాలకు చెం దిన ప్రజా ప్రతినిధులు ఎ మ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ గ్రామాలకు వెళ్లి పంట నష్టం నివేదికను సిద్ధం చేయాలని ఆదే శించారు.  ఏవో చంద్రశేఖర్‌ మాట్లాడుతు పం టలో 33 శాతం నుంచి 70 శాతం నష్టం ఉంటేనే అంచనా వేయడానికి వీ లుంటుంద న్నారు. మార్కాపురం వ్యవసాయ సహాయక సంచాలకులు రమాదేవి మాట్లా డుతూ రబీలో సాగు చేసిన శనగ పంట పూ ర్తిగా దెబ్బ తిన్నట్లు గుర్తించామన్నారు. మళ్లీ శనగ సాగు చేసుకునేందుకు అవకాశం ఉ న్నందున ప్ర భుత్వం 80 శాతం సబ్సిడీతో విత్తనాలు సర ఫరా చేస్తారన్నారు. శనగ కోల్పో యిన రైతులు ఆర్‌బీకేల్లో పేర్లు నమోదు చేయించు కోవాలని సూచించారు.  సమా వేశంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, జడ్పీటీసీ వెన్నా ఇందిర, ఎంపీడీవో  ఎస్‌.నర సింహులు, ప్రజాప్రతినిధులు, అధికా రులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement