Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంట నష్ట పరిహారం ప్రకటించాలి

ప్రొద్దుటూరు అర్బన్‌/రాజుపాళెం, నవంబరు 27: వరదల కార ణంగా దెబ్బతిన్న పంటలకు  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరి హారం ప్రకటించాలని బీజేపీ జాతీయ కిసాన్‌ మోర్చా ఉపాధ్యక్షు డు సురేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ప్రొద్దుటూరు, రాజు పాళెం మండలాల్లో వరదల వల్ల దెబ్బతిన్న పంటలను జాతీయ కిసాన్‌ మోర్చా నేతల బృందం ప్రొద్దుటూరులోని నంగనూరు పల్లె రాజుపాళెం మండలంలోని పలు గ్రామాలు సందర్శించా రు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్డాడుతూ వరదల వల్ల ప్రొద్దుటూరు రాజుపాళెం మండలాల్లో 40వేల ఎకరాల్లో శనగ, పత్తి, కంది పంటలతో పాటు వరి పంట తీవ్రంగా దెబ్బతిందన్నా రు.  జిల్లా వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల పంట దెబ్బతినిందన్నా రు. కేంద్రం నుంచి తమ వంతు సాయం అందించేప్రయత్నం చేస్తామన్నారు.  ఇప్పటికైనా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని రైతులు నష్టపోయిన నష్టాన్ని అంచనా వేసి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉట్టి శ్రీనివాసులు,  బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు, సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ క్రిష్ణ, రాజుపాళెం ప్రొద్దుటూరు మం డలాల అధ్యక్షులు గోపల్లె శ్రీనివాసులరెడ్డి, బోరెడ్డి సుధాకర్‌రెడ్డి పట్టణ అధ్యక్షుడు సుబ్రమణ్యంలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement