జనావాసాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 8 అడుగుల మొసలి.. బెంబేలెత్తిపోయిన ప్రజలు.. చివరికి ఏం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2022-01-09T17:02:45+05:30 IST

ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా మొసలి ఎంట్రీ ఇచ్చింది. దీంతో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్క

జనావాసాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 8 అడుగుల మొసలి.. బెంబేలెత్తిపోయిన ప్రజలు.. చివరికి ఏం జరిగిందంటే..!

ఇంటర్నెట్ డెస్క్: ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా మొసలి ఎంట్రీ ఇచ్చింది. దీంతో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. బెంబేలెత్తిపోయి పరుగులు తీశారు. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని శివపురి ప్రాంతంలోని ప్రజలు ఆదివారం ఉదయం ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇంతలో జనావాసాల్లోకి అకస్మాత్తుగా 8 అడుగుల పొదవున్న మొసలి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న ప్రజలు.. భయాందోళనకు లోనయ్యారు. దూరంగా పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి, దాన్ని బంధించాలని కోరారు. అయితే గంటలు గడిచినా కూడా అధికారులు రాకపోవడంతో స్థానిక యువత కీలక నిర్ణయం తీసుకున్నారు. పెద్ద పెద్ద కర్రల సహాయంతో ఆ మొసలిని దగ్గరలోని నీటి కాలువ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం దాన్ని అందులోకి పడేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పక్కనే ఉన్న కాలువలో మొసళ్లు ఉన్నాయని చెప్పారు. అవి అప్పుడప్పుడూ గ్రామాల్లోకి వస్తూ ఉంటాయని పేర్కొన్నారు. 




Updated Date - 2022-01-09T17:02:45+05:30 IST