ఈత కొడుతున్న వ్యక్తిపై దాడి చేసేందుకు.. తన భారీ నోటిని తెరిచి జెట్ స్పీడుతో వచ్చిన మొసలి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

ABN , First Publish Date - 2021-11-01T12:38:55+05:30 IST

సోషల్ మీడియాలో ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

ఈత కొడుతున్న వ్యక్తిపై దాడి చేసేందుకు.. తన భారీ నోటిని తెరిచి జెట్ స్పీడుతో వచ్చిన మొసలి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

సోషల్ మీడియాలో ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసినవారంతా క్షణకాలం పాటు ఊపిరిబిగపెడుతున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి నదిలో ఆనందంగా ఈత కొడుతున్నాడు. ఇంతలో ఒక మొసలి దాడి చేసేందుకు అతని దగ్గరకు జెట్ స్పీడుతో వస్తుండటాన్ని గమనించవచ్చు. 



ఆ తరువాత ఆ మొసలి తన పెద్ద నోటిని తెరిచి అతనిని మింగేందుకు ప్రయత్నించింది. అయితే ఆ భయంకరమైన మొసలిని గమనించిన ఆ వ్యక్తి వెంటనే తేరుకుని దాని బారి నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకూ 10 లక్షల మంది వీక్షించారు.

                                                   Cobrapost సౌజన్యంతో..

Updated Date - 2021-11-01T12:38:55+05:30 IST