మాటల్లో తేనె.. చేతల్లో కోతలు!!: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-06-07T08:49:31+05:30 IST

‘పాలనలో తనదైన ముద్ర వేయడమంటే... వైసీపీ పాలకుల అర్థాలే వేరు. టీడీపీ పథకాలకు వైసీపీ పేర్లు పెట్టుకోవడం, టీడీపీ కట్టిన భవనాలకు వైసీపీ రంగులేయడం, స్కీములు రద్దుచేసి, మసిపూసి మారేడు కాయ

మాటల్లో తేనె.. చేతల్లో కోతలు!!: చంద్రబాబు

అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘‘పాలనలో తనదైన ముద్ర వేయడమంటే... వైసీపీ పాలకుల అర్థాలే వేరు. టీడీపీ పథకాలకు వైసీపీ పేర్లు పెట్టుకోవడం, టీడీపీ కట్టిన భవనాలకు వైసీపీ రంగులేయడం, స్కీములు రద్దుచేసి, మసిపూసి మారేడు కాయ చేయడం.. ఇవే వైసీపీ పాలకుల ఏడాది నిర్వాకాలు’’ అని చంద్రబాబు దునుమాడారు. ‘‘ఒకచేత్తో ఇచ్చినట్లే ఇచ్చి, మరో చేత్తో లాక్కోవడం.. మాటల్లో తేనె, చేతల్లో కత్తులు, కోతలు. 420, మోసగాళ్ల పాలన కాదా?’’ అంటూ చంద్రబాబు శనివారం ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. కాగా, శనివారం రామానాయుడు జయంతి సందర్భంగా చంద్రబాబు నివాళులర్పించారు.

Updated Date - 2020-06-07T08:49:31+05:30 IST