అక్కసుతోనే టీఆర్‌ఎస్‌ విమర్శలు

ABN , First Publish Date - 2022-07-06T06:22:52+05:30 IST

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ సభ సక్సెస్‌ కావడాన్ని జీర్ణించుకోలేక, అక్కసుతో టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కటకం మృత్యుంజయం విమర్శించారు.

అక్కసుతోనే టీఆర్‌ఎస్‌ విమర్శలు
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కటకం మృత్యుంజయం

- బీజేపీ సమావేశాలు అడ్డుకునేందుకు ప్రజాఽధనం దుర్వినియోగం చేసిన సీఎం కేసీఆర్‌

- బీసీ మంత్రిగా బలహీనవర్గాలకు గంగుల చేసింది ఏమిటో చెప్పాలి

- మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కటకం మృత్యుంజయం

గణేశ్‌నగర్‌, జూలై 5: హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ సభ సక్సెస్‌ కావడాన్ని జీర్ణించుకోలేక, అక్కసుతో టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కటకం మృత్యుంజయం విమర్శించారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం గతంలో ఏ ప్రభత్వుం చేయనంత అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. నిన్న బీసీ మంత్రి గంగుల కమలాకర్‌ బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. బహిరంగసభలో పీఎం మోదీ హుందాగా, గౌరవంగా మాటాడారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు గంగలో కలిశాయని అన్నారు. మంత్రి గంగుల కేసీఆర్‌కు వంత పాడడం తప్ప చేసేది ఏమిలేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ ఏం చేశాడో చెప్పమని అడగడం కాదు, అసలు ఆయన బలహీనవర్గాలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రి గంగుల ఒక మున్సిపల్‌ చైర్మన్‌లా మాట్లాడుతున్నారని, మంత్రిలాగా మాట్లాడడం లేదన్నారు. ఆయన ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రిని కలిస్తే తానే స్వయంగా సన్మానిస్తానన్నారు. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఈజీఎస్‌ ద్వారా పనులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలను ముట్టుకునే అలవాటు బీజేపీకి లేదన్నారు. కేంద్ర నిధులతోనే కరీంనగర్‌ ఆకర్షణీయ నగరంగా మారిందన్నారు. సమావేశంలో మాజీ మేయర్‌ డి శంకర్‌, నాయకులు కొరటాల శివరామకృష్ణ, కన్న కృష్ణ, కల్లెం వాసుదేవరెడ్డి, మంజులావాణి, ఎండీ ముజీబ్‌, దుబాలశ్రీనివాస్‌, జాడి బాల్‌రెడ్డి, బల్బీర్‌సింగ్‌, చొప్పరి జయశ్రీ, బొంతల కళ్యాణ్‌చంద్ర, సంకటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T06:22:52+05:30 IST