లిస్బెన్: కరోనాబారిన పడిన యువెంటస్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో బార్సిలోనాతో జరిగే మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఈనెల 13న రొనాల్డోకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పరీక్ష చేయించుకోగా...మళ్లీ పాజిటివ్ వచ్చింది. దాంతో తన చిరకాల ప్రత్యర్థి లియోనెల్ మెస్సీ కెప్టెన్సీలోని బార్సిలోనాతో ఈనెల 28న జరిగే చాంపియన్స్ లీగ్ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌కు క్రిస్టియానో దూరం కానున్నాడు.