రొనాల్డో.. 75 కోట్ల కారు

ABN , First Publish Date - 2020-08-04T09:14:23+05:30 IST

లా వా ట్యూర్‌ నొవార్‌.. ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత ఆటోమొబైల్‌ సంస్థ బుగాటి తయారు చేసిన ప్రపంచంలోని అత్యంత ఖరీ దైన కారు ఇది. అక్షరాలా ...

రొనాల్డో.. 75 కోట్ల కారు

ప్రపంచంలో అలాంటివి 10 కార్లే

ట్యూరిన్‌ (ఇటలీ): లా వా ట్యూర్‌ నొవార్‌.. ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత ఆటోమొబైల్‌ సంస్థ బుగాటి తయారు చేసిన ప్రపంచంలోని అత్యంత ఖరీ దైన కారు ఇది. అక్షరాలా రూ. 75 కోట్ల విలువైన ఈ కారును ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో కొనుగోలు చేశాడు. ఇటాలియన్‌ క్లబ్‌ యువెంటస్‌కు ఇటీవల ‘సిరి ఎ’ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ అందించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఖరీదైన కారు కొనుక్కున్నాడు. ఈ విషయాన్ని అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. విశ్వవ్యాప్తంగా ఇప్పటిదాకా ఈ కార్లున్నది పది మందికి మాత్రమేనట. గంటకు 380 కి.మీ. వేగంతో దూసుకుపోయే లా వాట్యూర్‌.. 60 కి.మీ., వేగాన్ని కేవలం రెండు సెకన్లలోనే అందు కుంటుంది. కాగా.. రొనాల్డో గ్యారేజ్‌లో ఇప్పటికే దాదాపు రూ. 264 కోట్ల విలువ చేసే కార్లుండడం విశేషం. 35 ఏళ్ల క్రిస్టియానో మొత్తం రూ. 788 కోట్లతో ఈ ఏడాది అత్యధిక ఆర్జన కలిగిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే అతడు రూ. 53 కోట్లతో అత్యంత అధునాతన విహార నౌకను కూడా కొనుగోలు చేశాడు. 

Updated Date - 2020-08-04T09:14:23+05:30 IST