వృద్ధి రేటును కుదించిన క్రిసిల్‌

ABN , First Publish Date - 2021-05-11T05:51:20+05:30 IST

కరోనా రెండో ఉధృతిపై దేశీయ పరపతి రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉధృతి వచ్చే నెలాఖరు వరకు ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతం మించకపోవచ్చని...

వృద్ధి రేటును కుదించిన  క్రిసిల్‌

ముంబై: కరోనా రెండో ఉధృతిపై దేశీయ పరపతి రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉధృతి వచ్చే నెలాఖరు వరకు ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతం మించకపోవచ్చని తెలిపింది. ఈ నెలాఖరుతో ముగిస్తే మాత్రం 9.8 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఇదే సంస్థ నెల రోజుల క్రితం భారత జీడీపీ వృద్ధి రేటు 11 శాతం వరకు ఉంటుందని తెలిపింది. కరోనా రెండో ఉధృతి నేపథ్యంలో ఈ అంచనాలను తగ్గిస్తున్నట్టు క్రిసిల్‌ తెలిపింది. 


రికవరీ మరింత ఆలస్యం:ఫిచ్‌  

భారత్‌లో కొవిడ్‌ రెండో ఉధృతిపై అంతర్జాతీయ పరపతి రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మరింత ఆలస్యం అవుతుందని తెలిపింది. రెండో ఉధృతి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి  భారత ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కష్టాల్లో పడినట్టు పేర్కొంది. అయితే తాజా కొవిడ్‌ ‘ఆర్థిక’ కష్టాలు గత ఏడాది ఉన్నంత భారీ స్థాయిలో ఉండక పోవచ్చని అంచనా వేసింది. 

Updated Date - 2021-05-11T05:51:20+05:30 IST