నేరస్థులపై కఠినంగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2021-10-23T04:59:25+05:30 IST

గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు నడుం బిగించాలని, నేరస్థులపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశించారు. శుక్రవారం రేగిడి పోలీస్‌ స్టేషన్‌లో వార్షిక తనిఖీ చేపట్టారు.

నేరస్థులపై కఠినంగా వ్యవహరించాలి
పోలీస్‌ సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌ బర్దర్‌

ఎస్పీ అమిత్‌ బర్దర్‌ 

రేగిడి, అక్టోబరు 22: గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు నడుం బిగించాలని, నేరస్థులపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశించారు. శుక్రవారం రేగిడి పోలీస్‌ స్టేషన్‌లో వార్షిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టి సారించాలని, రోడ్డు ప్రమాదాలకు కారకులైన వారికి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. సమస్యత్మక గ్రామాల్లో వివాదాలకు కారణమైన వారిపై రౌడీషీట్‌లు తెరవాలని, చీటింగ్‌ తదితర కేసులను త్వరితగతిన పరిశోధించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, వ్యక్తిగతంగా వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐ శంకరరావు, ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ ఆలీ ఉన్నారు.

 




 

Updated Date - 2021-10-23T04:59:25+05:30 IST