Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగ్గంపేట పోలీస్‌ స్టేషన్‌ నుంచి ముగ్గురు నిందితుల పరార్‌

  • గాలింపులో రెండు ప్రత్యేక బృందాలు

జగ్గంపేట, డిసెంబరు 3: జగ్గంపేట పోలీస్‌ స్టేషన్‌ నుంచి శుక్రవారం ఉదయం ముగ్గురు  నిందితులు పరారయ్యారు.  ఈ సంఘటనపై పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం గండేపల్లి మండలం తాళ్ళూరు దాబా వద్ద గురువారం రాత్రి ఒక కారును తనిఖీ చేస్తుండగా ఆరు కేజీల గంజా యిని గండేపల్లి పోలీసులు పట్టుకున్నారు. నింది తులను పోలీసులు అదుపులోకి తీసుకుని గండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉంచడానికి ఇబ్బంది కరంగా ఉండడంతో జగ్గంపేట పోలీస్‌స్టేషన్‌కు ఆ ముగ్గురినీ తరలించారు. అయితే శుక్రవారం ఉదయం ముగ్గురు నిందితులు వెనుక వైపు ఉన్న గేటు తాళాన్ని పగులగొట్టి పరారైనట్టు డీ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల కోసం  రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలి స్తున్నట్టు నిర్వహిస్తున్నట్టు ఆయన తె లిపారు.

Advertisement
Advertisement