వెంటాడిన నేరం..

ABN , First Publish Date - 2020-07-12T07:16:37+05:30 IST

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇదొక హెచ్చరిక వంటిది. నేరం చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదనడానికి ఒక ఉదాహరణ. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో 38 ఏళ్ల క్రితం జరిగిన బ్యాంకు దోపిడీ...

వెంటాడిన నేరం..

  • 38 ఏళ్లనాటి దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్‌

పాలన్‌పూర్‌, జూలై 11: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇదొక హెచ్చరిక వంటిది. నేరం చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదనడానికి ఒక ఉదాహరణ. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో 38 ఏళ్ల క్రితం జరిగిన బ్యాంకు దోపిడీ, హత్య కేసులో నిందితుడైన 68ఏళ్ల దీప్‌సింగ్‌ రాజ్‌పుత్‌ను రాజస్థాన్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. బార్మెర్‌ జిల్లాలో ఒక గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 1982 డిసెంబరు 30న అమీర్‌గధ్‌లోని భారతీయ స్టేట్‌ బ్యాంకులో దోపిడీ చేసిన ఏడుగురు దొంగల బృందానికి రాజ్‌పుత్‌ నాయకుడని ఎస్పీ తరుణ్‌ కుమార్‌ దగ్గల్‌ చెప్పారు. అప్పట్లో రూ.1.32లక్షలు దోచుకున్న ఈ దొంగల బృందం.. బ్యాంకు మేనేజర్‌పై దాడి చేయడంతో పాటు కానిస్టేబుల్‌ శివదత్‌ శర్మను హత్య చేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో 1983లో ఒకరిని, 1984లో మరొకరిని అరెస్టు చేయగా.. నలుగురు నిందితులు మరణించారని చెప్పారు.


Updated Date - 2020-07-12T07:16:37+05:30 IST