Abn logo
Nov 26 2020 @ 00:37AM

పథకం ప్రకారమే గ్రానైట్‌ వ్యాపారి హత్య

కోదాడ రూరల్‌, నవంబరు 25: అనంతగిరి మండలంలోని శాంతినగర్‌ గ్రామ శివారులో జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేధించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్‌.మోహన్‌కుమార్‌, రూరల్‌ సీఐ శివరాంరెడ్డి స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరులకు బుధవారం వెల్లడించారు. తమిళనాడు రాష్ర్టానికి చెందిన వెనిశెట్టి రంగనాథ్‌(43), చల్లా రమేష్‌ గ్రానైట్‌ వ్యాపారం చే సేందుకు 20సంవత్సరాల క్రితం ఖమ్మం వచ్చారు. అనంతగిరి మండలంతో పాటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాల్లో గ్రానైట్‌ వ్యాపారం కొనసాగిస్తు న్నారు. చల్లా రమేష్‌ భార్య రాజేశ్వరితో రంగనాథ్‌కు పరిచయం ఏర్పడి ఏడు సం వత్సరాలుగా ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకుని రమేష్‌ భార్యను కొట్టాడు. సంవత్సరం నుంచి వారి మధ్య గొడవలు చోటుచేసు కుంటున్నాయి. 20రోజుల కిందట రమేష్‌ తన భార్య రాజేశ్వరిని కొట్టడంతో ఆమె తన తల్లిగారి ఊరైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తూరుకు వెళ్లింది. రంగనాథ్‌ ఆమెను ఖమ్మంలోని ఓ కుట్టుమిషన్‌ కేంద్రంలో చేర్పించాడు. పిల్లలను చూసుకునేందుకు ఇబ్బందింగా ఉండడంతో రమేష్‌ ఈనెల 22న ఖమ్మంలోని భార్య దగ్గరకు వెళ్లాడు. ఇద్దరం విడిగా ఉంటే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని, కలిసి ఉందామని చెప్పాడు. అడ్డంకిగా ఉన్న రంగనాథ్‌ను ఎలాగైనా హత్య చేయాలని, ఇందుకు సహకరించమని భార్యను కోరాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. ఇందుకు పథకం రూపొందించుకున్నారు. ఈ నెల 22వ తేదీన రాత్రి రాజేశ్వరి రంగనాథ్‌కు ఫోన్‌చేసి అనంతగిరి మండలం శాంతినగర్‌ గుట్ట లోకి వెళ్దామని చెప్పింది. రంగనాథ్‌ ఖమ్మం నుంచి తన బొలేరో వాహనంలో తల్లిగారి ఊరైన కొత్తూరులో ఇంటి వద్ద రాజేశ్వరిని ఎక్కించుకుని వెళ్లాడు. రమే ష్‌ బొలేరో వాహనం వెనుక బైక్‌ శాంతినగర్‌శివారు గుట్ట వద్దకు చేరుకున్నాడు. తన భార్య, రంగనాథ్‌ కూర్చుని మాట్లాడుతుండగా, అక్కడ ఉన్న ఓ కర్రతో రం గనాథ్‌ తలపై కొట్టాడు. రంగనాథ్‌, రమేష్‌ మధ్య పెనుగులాట జరిగింది. రంగ నాథ్‌ కిందపడడంతో రమేష్‌ అతని తలపై రాయివేసి చంపినట్లు పోలీసులు తెలి పారు. హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో రమేష్‌, అతని భార్య రాజేశ్వరిని అరెస్ట్‌ చేసి కోదాడ మునిసబ్‌ కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ వివరించారు. రూరల్‌ సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐలు సైదులు, నాగభూషణాలను డీఎస్పీ అభినందించారు. 


కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

సూర్యాపేట క్రైం, నవంబరు 25: కుటుంబ కలహాలతో సూర్యాపేటలో ఓ వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... జిల్లాకేంద్రానికి చెందిన నోముల వెంకటేష్‌(55) సద్దుల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతుండడంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వెంకటేష్‌ కుమారుడికి వి వాహం కాగా కోడలు కుమారుడు మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. కొంతకాలంగా కోడలు కాపురానికి రావడంలేదు. రెండు కుటుంబాల మధ్య ఏర్పడ్డ కలహాలను పరిష్కరించేందుకు బంధుమిత్రులు ప్రయత్నించారు. బుధవారం కూడా కోడలికి సంబంధించిన బంధువులు వెంకటేష్‌ కుటుంబసభ్యులతో చర్చించినట్లు సమాచారం. ఈ విషయంలో మనస్థాపం చెందిన వెంకటేష్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోలీసులు బయటకు తీయించారు. 


మహిళ మెడలోంచి గొలుసు అపహరణ

నేరేడుచర్ల, నవంబరు 25: మహిళ మెడలోంచి దుండగులు బంగారు గొలుసు అపహరించారు. ఈ ఘటన నేరేడుచర్లలో బుధవారం జరిగింది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన చింతరెడ్డి రాములమ్మ ఆమె భర్త రాంకోటిరెడ్డి ఇరువురు బైక్‌పై నేరేడుచర్లలోని జాన్‌పహాడ్‌ రోడ్డులో ఉన్న బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చారు. తర్వాత హుజూర్‌నగర్‌ రోడ్డులోని బంధువుల ఇంటి వద్దకు వెళ్లారు. ద్విచక్ర వాహనం దిగి లోనికి వెళ్లబోతుండగా ఎదురుగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు రాములమ్మ మెడలోని మూడు తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. బాధితురాలు కేక లు వేయడంతో ఆమె భర్త, అక్కడే ఉన్న ఇద్దరు ఆ దుండగులను వెంబడించారు. వారు బైక్‌పై వేగంగా హుజూర్‌నగర్‌ వైపునకు పారిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాదవేంద్రరెడ్డి తెలిపారు. 


కారు, బైక్‌ ఢీ.. ముగ్గురికి గాయాలు 

మునగాల, నవంబరు 25: కారు,బైక్‌ ఢీకొని ముగ్గురికి గాయలయ్యాయి.  ఈ సంఘటన మండలకేంద్రంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన పోకూరి నాగేశ్వరరావు, అతని కుటుంబసభ్యులు రవికృష్ణ, అనూష, సాయి, రిషిత కలిసి కారులో కరీనంగర్‌ నుంచి ఏపీలోని గుం టూరుకు వెళ్తున్నారు. మునగాల వద్ద జాతీయ రహదారిపై చిలుకూరు మండ లం నారాయణపురం గ్రామానికి చెందిన నాగరాజు బైక్‌పై కోదాడ వైపు వెళ్తుం డగా, వెనుక నుంచి కారు ఢీకొట్టింది. నాగరాజుకు గాయాలయ్యాయి. కారులో ఉన్న రవికృష్ణ, అనూష, సాయి, రిషితలకు కూడా గాయాలయ్యాయి. క్షతగా త్రులను ఆటోలో కోదాడకు తరలించారు.   

రోడ్డు దాటుతుండగా..

నాగారం: రోడ్డు దాటుతుండగా తల్లీకూతుళ్లను కారు ఢీ కొట్టడంతో గాయప డ్డారు. ఈ సంఘటన తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... నాగారం సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న షేక్‌ ఆశబేగం, తన ఐదేళ్ల కూతురు  సుమయాబేగంతో ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద రోడ్డు దాటుతుండగా జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. 


కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

అడ్డగూడూరు, నవంబరు 25: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అడ్డగూడూరు మండలంలోని జానకిపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గద్దగూటి అశోక్‌ (45) వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్‌కు ఇద్దరు కూమారులు, భార్య ఉన్నారు.   కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు.


మిస్సింగ్‌ కేసు నమోదు 

బీబీనగర్‌, నవంబరు 25: బీబీనగర్‌ పట్టణానికి చెందిన టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుడిపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపారు. మండల కేంద్రంలోని పోచంపల్లి చౌరస్తాలో రైల్వే స్టేషన్‌ ఎదురుగా టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న మున్నా అనే యువకుడు ఈనెల 27న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి రాంనాథ్‌శర్మ, బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement