నేర సమాచారం

ABN , First Publish Date - 2020-12-05T06:19:58+05:30 IST

డీ హీరేహాళ్ మండల పరిధిలోని కల్యం గ్రామం పెట్రోల్‌ బంక్‌ సమీపంలో శుక్రవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రాయదుర్గం వాసి రాజు (32)ను గుర్తుతెలియని ద్విచక్రవాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

నేర సమాచారం


గుర్తు తెలియని బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

డీ హీరేహాళ్‌, డిసెంబరు 4  : మండల పరిధిలోని కల్యం గ్రామం పెట్రోల్‌ బంక్‌ సమీపంలో  శుక్రవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రాయదుర్గం వాసి రాజు (32)ను గుర్తుతెలియని ద్విచక్రవాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని ఆస్పత్రికు తరలించామని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. 


విశ్రాంత రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

గుంతకల్లుటౌన్‌ , డిసెంబరు 4 : పట్టణంలోని సిద్దేశ్వర నగర్‌కు చెందిన విశ్రాంత రైల్వే గ్యాంగ్‌మెన్‌ సీ రామాంజినేయులు (61) ఇంట్లో ఉరి వేసుకుని శుక్రవారం ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితం  ఉద్యోగ విరమణ పొందిన ఆయన కొ ద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య రామచంద్రమ్మ  ఈ విషయాన్ని కసాపురం పోలీసులకు సమాచారం  అందజేశారు. మృతదేహాన్ని  ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 


నీటికుంటలో శిశువు మృతదేహం లభ్యం 

కదిరిఅర్బన్‌,  డిసెంబరు 4 : కదిరి రూరల్‌ పరిధిలోని ముత్యాలచె రువు దగ్గర కరావులకుంటలో శుక్రవారం ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి శిశువు మృతదేహాన్ని వెలికి తీశారు. జ న్మించిన ఒకటి, రెండు రోజుల్లోనే శిశువు మృతి చెంది ఉంటుందని స్థాని కులు అంటున్నారు. శిశువు మృతదేహాన్ని స్థానికులు ఖననం చేశారు. 


యువకుడి ఆత్మహత్య

అనంతపురం క్రైం, డిసెంబరు 4: నగర శివారుకాలనీకి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. నగర శివారులోని విద్యారణ్యనగర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ కొండయ్య కుమారుడు ఫణికుమార్‌(28) మతిస్థిమితం సరిగాలేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఇంటిలో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధులు ముగించుకుని కొండయ్య ఇంటికి వచ్చి చూడగా.. ఉరికి వేలాడుతున్న తమ కుమారుడిని చూసి భోరమని విలపించారు. గత కొన్నేళ్లుగా మానసిక పరిస్థితి బాగలేక తీవ్రమనస్థాపం చెందిన ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధిత తల్లిదండ్రులు కన్నీటి పర్యావంతమయ్యారు. రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునిబాధిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 


==============================================================



రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గుత్తిరూరల్‌, డిసెంబరు 4 : మండలంలోని యంగిలిబండ గ్రామ శివారులోని 67వ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దవడుగూరు మండలం క్రిష్టపాడు గ్రామానికి చెందిన హుస్సేన్‌ పీరా (57) మరణించాడు. హుస్సేన్‌పీరా, రాయలచెరువుకు చెందిన అశోక్‌ గుత్తికి వచ్చి యంగిలిబండ గ్రామ శివారులో నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిద్దరినీ స్థానికులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హుస్పేన్‌ పీరాను అనంతపురానికి తరలించగా అక్కడ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. 


==============================================================


గొళ్లలదొడ్డిలో యువకుడు ఆత్మహత్య

గుంతకల్లుటౌన్‌, డిసెంబరు 4  : మండలంలోని గొళ్లలదొడ్డి గ్రామానికి చెందిన ఆవుల రమేష్‌ (25) శుక్రవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనులు చేసుకునే అతనికి ఈ నెల 18న వివాహం జరగాల్సి ఉంది. ఉదయం తన పొలంలో పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని కేసు దర్యాప్తు చేస్తున్న రూరల్‌ పోలీసులు తెలిపారు. 


==============================================================




గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం 

పుట్టపర్తిరూరల్‌,  డిసెంబరు 4 : మండల పరిధిలోని రైల్వేస్టేషన్‌ కెనా ల్‌ బ్రిడ్జి వద్ద శుక్రవారం రా త్రి ఓ గుర్తుతెలియని వా హనం ఢీకొని వినోద్‌ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. పుట్టపర్తి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... అనంతపురానికి చెందిన వినోద్‌(37) అనే వ్యక్తి పుట్టపర్తిలోని శిల్పారామంలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు.  కొత్తచెరువు నుంచి పుట్టప ర్తికి ద్విచక్రవా హనంలో వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 


=============================================================


అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కొత్తచెరువు, డిసెంబరు 4 : మండల కేంద్రంలోని బీసీకాలనీలో శుక్రవారం ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు  ఇలా ఉన్నాయి. కొత్తచెరువు గ్రా మానికి చెందిన బండారి చెన్నప్ప(43) స్థానిక వి జయనగర్‌ కాలనీలో నివసిస్తున్నాడు. గ్రామంలోని ఓ టింబర్‌ డిపోలో హమాలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవా డు. అతడు గురువారం సాయంత్రం 6గంటలకు బీసీకాలనీలో నివసిస్తున్న బోయ రామాంజనమ్మ ఇంటికి వచ్చాడు. రాత్రి అక్కడే ఉన్నాడు. అయితే ఏమిజరిగిందో తెలియదు అక్కడే మృతిచెందాడు. స్థానిక వలంటీర్‌, స్థానికులు శుక్రవారం ఉదయం  గమనించి పోలీసులకు సమాచారంఅందించారు. దీంతో సీఐ నరసింహరావు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చెన్నప్ప రామాంజనమ్మ ఇంటికి వచ్చినట్టు స్థానికులు పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పె నుకొండ ప్రభు త్వాస్పత్రికి తర లించారు. మృ తుడికి ఇద్దరు భార్యలు. మొ దటి భార్యకు ఇద్దరు కు మారులు, ఒక కుమార్తె. రెం డో భార్యకు ఒక కుమార్తె ఉన్నారు.  చెన్నప్ప గుండెపోటుతో మృతిచెంది ఉండవచ్చని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  విజయనగర కాలనీలో నివసిస్తున్న చెన్నప్ప బీసీకాలనీలో రామాంజనమ్మ ఇంట్లో మృతిచెందడం పలు అనుమానాలకు దారితీస్తోంది.  పోలీసులు రామాంజనమ్మను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


 

Updated Date - 2020-12-05T06:19:58+05:30 IST