నేర సమాచారం

ABN , First Publish Date - 2020-12-04T06:20:35+05:30 IST

మండలంలోని పూలకుంట సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గోనబావికి చెందిన యువకుడు లోకేష్‌ (28) మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.

నేర సమాచారం

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి 

గుమ్మఘట్ట, డిసెంబరు 3: మండలంలోని పూలకుంట సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గోనబావికి చెందిన యువకుడు లోకేష్‌ (28) మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలివి. రాయదుర్గం నుంచి లోకేష్‌ ద్విచక్రవాహనంలో గోనబావికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ప్రమాదంలో లోకేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనదారులు దేవేంద్ర, సావమ్మ, చిన్న సిద్ధ గాయపడగా బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు. 

 

యువకుడి ఆత్యహత్య 

శెట్టూరు, డిసెంబరు 3: మండలంలోని యాటకల్లు గ్రామానికి చెందిన తలారి ఈరన్న (28) గురువారం ఉరేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. ఈరన్న ఇటీవల వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో మనస్తాపం చెంది పాడుబడిన ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య గౌరమ్మ, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


గుంతకల్లులో వివాహిత  ఆత్మహత్య

గుంతకల్లు టౌన్‌, డిసెంబరు 3 : పట్టణంలోని పక్కీరప్పకాలనీకి చెందిన వివాహిత అమీర అలియాస్‌ శిల్ప (24) గురువారం ఉరేసుకుంది. స్థానిక ఎస్‌ఎల్వీ టాకీస్‌ సమీపంలో నివాసముంటున్న  శిల్పను పక్కీరప్ప కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ వాజిత్‌ మూడేళ్ల క్రితం ప్రేమించిపెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెందిన అమీరఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దింపి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కసాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


కడుపు నొప్పి తాళలేక యువకుడి ఆత్మహత్య

కూడేరు, డిసెంబరు 3 : మండలంలోని కమ్మూరు గ్రామానికి చెందిన యువకుడు రేవంత్‌ రెడ్డి (23) కడుపునొప్పి తాళలేక గురువారం ఉరివేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. గత కొంతకాలంగా రేవంత్‌ రెడ్డి కడుపునొప్పితో బాధపడుతూ ఉండేవాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి రామాంజనేయరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


కార్మికుల మధ్య గొడవ

యువకుడి హత్య 


హిందూపురం టౌన్‌, డిసెంబరు 3: తూముకుంట పారిశ్రామిక వాడలో కార్మికుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతిచెందినట్లు సీఐ శ్రీరామ్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. తూముకుంట పారిశ్రామికవాడలోని రత్న ప్లాస్టిక్‌ పరిశ్రమలో ఒడిసా రాష్ట్రం కేంద్రపర జిల్లాకు చెందిన యువకులు కార్మికులుగా పనిచేస్తున్నారు. బుధవారం మఽధ్యాహ్నం వారి మధ్య చిన్న గొడవ తలెత్తింది. ఇది ఘర్షణకు దారితీసింది. దీంతో బుధవారం రాత్రి మిషన్‌ వద్ద మధ్యా హ్నం గొడవపడిన యువకులు రత్నకర్‌ జినే, రాజకిషోర్‌జినే పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి రత్నకర్‌ జినే(22)ని రాజకిషోర్‌ జినే కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రత్నకర్‌ జినేను స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ యువకులిద్దరూ బంధువులేనన్నారు.


==============================================================



చేనేత కార్మికుడి ఆత్మహత్య

ధర్మవరంఅర్బన్‌, డిసెంబరు 3: అనారోగ్యంతో  ఓ చేనేత కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం పట్టణంలోని శాంతినగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వి వరాల మేరకు శాంతినగర్‌కు చెందిన చ ట్టారామక్రిష్ణ (70) మగ్గం నేస్తూ జీవనం సాగించేవాడు. ఇతడి భార్య రత్నమ్మ నా లుగు సంవత్సరాల క్రితమే మృతిచెందిం ది. కుమారుడు లోకేశ్‌, కుమార్తెలు సుక న్య, కవిత ఉన్నారు. వీరికి వివాహాలు అ య్యాయి. దీంతో రామక్రిష్ణ ఒంటరి జీవి తం గడుపుతూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో అనారోగ్యానికి గురయ్యాడు. కు టుంబసభ్యులు కూడా వైద్యచికిత్సలు చేయించారు.ఆరోగ్యం కుదుటపడకపోవడంతో గురువారం రాత్రి ఓ టిస్టాల్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సీఐ కరుణాకర్‌, ఎస్‌ఐ సతీశ్‌లు సిబ్బందితో సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమో దు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-12-04T06:20:35+05:30 IST