Abn logo
Dec 2 2020 @ 01:18AM

నేర సమాచారం


సాంకేతికతతో పట్టుబడిన ఆలయాల దొంగ

రాప్తాడు, డిసెంబరు 1: మండలంలోని హంపాపురం ఆంజనేయస్వామి ఆలయంలో  చోరీకి పాల్పడుతున్న నల్లమా డ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రంగనాథ్‌ను పోలీసులు సాంకేతికత సా యంతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంగళవారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఇటుకపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్‌, రాప్తాడు ఎస్‌ఐ ఆంజినేయులు తెలిపిన వివరాల మేరకు.. నిందితుడు రంగనాథ్‌, మరో వ్యక్తి పాత నేరస్థులు. ఇద్దరూ కలిసి రాప్తాడు, సీకేపల్లి, గార్లదిన్నె, ఆత్మకూరు, నల్లచెరువు, చిలమత్తూరు, గోరంట్ల, ఎన్‌పీకుంట, తలుపుల, తనకల్లు పోలీ్‌సస్టేషన్ల పరిధిలోని 15 దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో వీరు హంపాపురం ఆంజనేయస్వామి ఆలయంలో చోరీకి యత్నించా రు. వారు తాళాన్ని తాకగానే అలారం మోగడంతో స్థానికులు అప్రమత్తమై వెం టనే రాప్తాడు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా రంగనాథ్‌ను పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న రూ.30 వేల నగదు, 10 తులాల వెండి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పారిపోయాడు. నిందితుడ్ని అరెస్ట్‌ చేసిన రాప్తాడు ఎస్‌ఐ, ఏఎ్‌సఐ నాగభూషణం, సిబ్బంది సంజీవులు, అంజన్‌కుమార్‌, దేవానాయక్‌, గరిబాబు, రంగప్పలను ఎస్సీ సత్యయేసుబాబు అభినందించారు.


==============================================================

ఆత్మహత్య చేసుకున్న వృద్ధులు (ఫైల్‌)


ఆత్మహత్య చేసుకున్న అదృశ్యమైన వృద్ధులు

విషం తాగి హంపిలో మృతి

కణేకల్లు, డిసెంబరు 1 : రెండు రోజుల క్రి తం అదృశ్యమైన మండలంలోని గరుడచేడు గ్రామానికి చెందిన కమలమ్మ (60), మీనాక్షమ్మ (65) కర్ణాటకలోని హంపిలో ఆత్మహ త్య చేసుకుని మృతి చెందినట్లు కణేకల్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వారిద్దరూ స్వయాన అక్కచెల్లెళ్లు. మీనాక్షమ్మకు సంతా నం లేకపోవడంతో సోదరి వద్దనే ఉంటోంది. కమలమ్మ కుమారుడు జలంధర్‌రెడ్డి పిల్లల చదువుల నిమిత్తం అనంతపురంలో ఉంటున్నాడు. గరుడచేడుకు వస్తూ వెళుతూ ఉండేవాడు. అక్కాచెల్లెళ్లు గరుడచేడులోనే ఉంటున్నారు. వృద్ధులు కావడం, అనారోగ్యంతో ఉం డటంతో ప్రతినెలా అనంతపురం వెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేవారు. ఆదివారం చికిత్స కోసం అనంతపురం వెళతామని చెప్పి న వారు మానసిక వేదనతో హంపికి వెళ్లి అక్కడే విషం తాగి, మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై అదృశ్యమైన కేసును కణేకల్లు పోలీసులు నమోదు చేసుకోగా, ఆత్మహత్య కేసు హంపి పోలీసులు న మోదు, చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. వృ ద్ధుల మృతి విషయాన్ని తెలుసుకున్న టీడీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు గరుడచేడుకు వెళ్లి, మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లాలెప్ప, ఆ నంద్‌, సుదర్శన్‌, ఆనందరెడ్డి, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.


==========================================================

మృతి చెందిన గంగోత్రిబాయి


కడుపునొప్పితో విద్యార్థిని ఆత్మహత్య

గుడిబండ, డిసెంబరు 1: మండలంలోని జి.ఎస్‌.తండా గ్రా మానికి చెందిన సిద్దరామనాయక్‌ కుమార్తె గంగోత్రిబాయి(18) అనే విద్యార్థిని కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌ యా దవ్‌ తెలిపారు. ఎస్‌ఐ అందించి న వివరాల మేరకు గంగోత్రిబాయి గు డిబండ జూనియర్‌ కళాశాలలో ఇం టర్‌ మీడియట్‌ చదివింది. మూడు సంవత్సరాల నుంచి తరచూ కడుపు నొప్పి వచ్చేదని, నొప్పిని భరించలేక తన ఇంటి సమీపంలోని మల్బరీ షెడ్డులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement