ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, సిబ్బందిపై దాడి

ABN , First Publish Date - 2021-02-27T06:35:35+05:30 IST

ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, సిబ్బందిపై దాడిచేసి విధులకు ఆటంకం కలిగించిన నలుగురు యువకులను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, సిబ్బందిపై దాడి

 నలుగురు యువకుల అరెస్టు


బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, సిబ్బందిపై దాడిచేసి విధులకు ఆటంకం కలిగించిన నలుగురు యువకులను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మాసబ్‌ట్యాంక్‌కు చెందిన మేసమ్‌ డర్వి్‌ష(27)కవసాకి వాహనంపై జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 10 నుంచి చెక్‌పోస్టు వరకు పెద్ద శబ్దం చేస్తూ వెళ్తున్నాడు. శబ్ద కాలుష్యం ఉండడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ హోంగార్డు రాథోడ్‌ వాహనాన్ని ఆపాడు. దీంతో రాథోడ్‌ను యువకుడు దుర్భాషలాడాడు. డర్వి్‌షకు తోడుగా అతడి స్నేహితులు మోసెన్‌ డర్విష్‌, మహ్మద్‌ హసన్‌ యవారి, మహ్మద్‌ అలీడర్విష్‌ అక్కడికి చేరుకున్నారు. వారు హోంగార్డుపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్‌ సీఐ ముత్తు కూడా అక్కడికి వెళ్లారు. యువకులు సీఐ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు. ట్రాఫిక్‌ పోలీసుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మేసమ్‌ డర్వి్‌షపై గతంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసిన కేసులున్నాయని తెలిసింది. 


Updated Date - 2021-02-27T06:35:35+05:30 IST