ఆస్తి కోసం అత్తను కడతేర్చాడు..

ABN , First Publish Date - 2020-12-06T05:37:45+05:30 IST

ఆస్తి కోసం అత్తను అల్లుడు కడతేర్చిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగింది.

ఆస్తి కోసం అత్తను కడతేర్చాడు..

నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు, 5 : ఆస్తి కోసం అత్తను అల్లుడు కడతేర్చిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన షేక్‌ రఫీఉన్నీషా(55)కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు జంగారెడ్డిగూడెంలో, కుమార్తె భర్తతో కలిసి గూడెంలోనే వేరేచోట నివాసం ఉంటున్నారు. చెడు వ్యవసనాలకు బానిసైన చిన్న కుమారుడితో స్థానిక సుబ్బారావు పేటలో ఆమె నివాసం ఉం టుంది. అల్లుడు షేక్‌ ఉస్మాన్‌ బాషా అత్త పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మిం చేందుకు ప్రయత్నం చేయగా ఆమె ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో నవంబరు 30న అత్త రఫీఉన్నీషాతో చిన్నకొడుకు చెడు వ్యసనాల నివారణ కోసం పసర మందు ఇప్పిస్తానని నమ్మబలికి కారులో ఎక్కించుకుని వెంకట్రామన్నగూడెం ప్రాంతంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లి స్ర్కూడైవర్‌తో గొంతు, చాతిలో పొడిచాడు. ఆమె కదులుతుండడంతో చీరకొంగును మెడకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని ఆమె నివాసానికి చేర్చాడు. మరుసటి రోజు చిన్నకుమారుడు చూసి బావకు ఫోన్‌ చేయగా డబ్బుల కోసం దొంగలు చంపి ఉంటారని, పోలీసులకు సమాచారమిస్తే శవాన్ని నాలుగు రోజుల వరకు ఇవ్వరంటూ నమ్మించి ఖననం చేసేందుకు సిద్ధం చేశాడు. దీనిపై స్థానికులు వీఆర్‌వోకు సమాచారం అందించగా ఆయన ఫిర్యాదు మేరకు రూరల్‌ సీఐ వీరా రవికుమార్‌ ఆధ్వర్యం లో ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగం గా విచారణ చేపట్టగా అల్లుడిపై అనుమానం వచ్చింది. శనివారం వెంకట్రామన్నగూడెం ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు ఉస్మాన్‌ భాషా అనుమానాస్పదంగా సంచరించడం గమనించి విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన సీఐలు రవికుమార్‌, ఆకుల రఘు, ఎస్‌ఐలు కేవై దాస్‌, ఏఎస్‌ఐ వెంకన్న బాబు, సిబ్బం ది ఆదినారాయణ, మోహన్‌అప్పారావులను ఎస్పీ, డీఎస్పీలు అభినందించారు.

Updated Date - 2020-12-06T05:37:45+05:30 IST