100 మి.లీ. హ్యాష్‌ ఆయిల్‌ స్వాధీనం

ABN , First Publish Date - 2021-08-02T06:42:20+05:30 IST

మాదకద్రవ్యాలు సరఫరా చేసి విక్రయించే ప్రయత్నం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

100 మి.లీ. హ్యాష్‌ ఆయిల్‌ స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్ట్‌ 1 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలు సరఫరా చేసి విక్రయించే ప్రయత్నం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 100 మి.లీ. హ్యాష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. గుడిమల్కాపుర్‌ ప్రాంతానికి చెందిన వడ్ల లక్ష్మీ వెంకట నరసింహచారి(31)డీజే సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అత్తాపూర్‌ హైదర్‌గూడ నివాసి ముల్కల భాను ప్రకాశ్‌(23) క్యూ కనెక్ట్‌లో బీపీఓగా పనిచేస్తున్నాడు. గుడిమల్కాపుర్‌లో హ్యాష్‌ ఆయిల్‌ నిల్వ ఉంచారని సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 20 బాక్సుల్లో నిల్వ ఉంచిన 100 మి.లీ. హ్యాష్‌ ఆయిల్‌, హీట్‌ గన్‌, డిజిటల్‌ వేయింగ్‌ మెషీన్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గుంటూరులో ప్రవీణ్‌ అనే వ్యక్తి వద్ద హ్యాష్‌ ఆయిల్‌ కొనుగోలు చేసి నగరానికి తరలించి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. పరారీలో ఉన్న ప్రవీణ్‌ కోసం గాలిస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పట్టుబడిన ఇద్దరిని ఆసి్‌ఫనగర్‌ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2021-08-02T06:42:20+05:30 IST