Abn logo
Apr 16 2021 @ 01:24AM

కూలీ హత్య కేసులో నిందితుడి అరెస్టు

బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): మద్యం తెప్పించలేదని కూలీని హత్య చేసిన నిందితుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన శివ(40) జీహెచ్‌ఎంసీ గార్డెనింగ్‌ పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. పని పూర్తయ్యాక ఫుట్‌పాత్‌పై నిద్రపోతుంటాడు. ఫుట్‌పాత్‌లపై డేవిడ్‌ సాగయరాజ్‌, శ్రీనివాస్‌, రాకే్‌షతో అతడికి పరిచయం ఏర్పడింది. వారు కూడా కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ నెల 11న నలుగురూ కలిసి సిద్దిపేట వెళ్లారు. అక్కడి నుంచి కొమురవెల్లి వెళ్లి మద్యం తాగారు. తిరిగి నగరానికి వచ్చి మరోసారి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్నశివ, డేవిడ్‌ మాటా మాటా అనుకున్నారు. శ్రీనివాస్‌, రాకేష్‌ వారికి సర్దిచెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. శివ నిద్రపోతుండగా డేవిడ్‌ మద్యం తెప్పించాలని కోరాడు. శివ డబ్బు లేదన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో శివ డేవిడ్‌పై దాడి చేశాడు. కోపోద్రిక్తుడైన డేవిడ్‌ బండరాయితో శివ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. 


Advertisement
Advertisement