దాహం కేకలు

ABN , First Publish Date - 2022-04-25T05:11:29+05:30 IST

ఎండలు మండిపోతుండడంతో నీటి కోసం జనం అల్లాడిపోతున్నారు.

దాహం  కేకలు

10 రోజులకు ఒకసారి  నీటి సరఫరా

 ఎండలు మండిపోతుండడంతో నీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. 10 రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతుండడంతో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆలూరు మండలం హత్తిబెళగల్‌ గ్రామంలో ఆదివారం 10 రోజుల తర్వాత తాగునీరు సరఫరా అవడంతో గ్రామస్థులు నీటి కోసం ఎగబడ్డారు. తోపుడు బండ్లు వేసుకుని ట్యాంక్‌ వద్ద బారులుదీరారు. విద్యుత కోతలు ఉండటంతో బాపురం రిజర్వాయర్‌ నుంచి నీరు పంపింగ్‌ అయ్యి ఆలూరు మండలానికికు సరఫరా అవుతుండడంతో ఈ దుస్థితి నెలకొంది. తాగునీటి తీవ్రత తలెత్తకుండా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దృష్టి సారించాలి. 

           -ఆలూరు

 



Updated Date - 2022-04-25T05:11:29+05:30 IST