Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 25 Apr 2022 11:53:36 IST

త్వరలో బాలీవుడ్‌కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ టెండూల్కర్ కూతురు సారా..?

twitter-iconwatsapp-iconfb-icon

దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సాధించిన సెలబ్రిటీల పిల్లల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా ఒకరు. తండ్రిలాగే ఈ బ్యూటీకి సైతం ఇండియా వైడ్‌గా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే వీలు కుదిరినప్పుడల్లా సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ గురించి నెట్టింట ఓ క్రేజీ వార్త హల్‌చల్ చేస్తోంది. సారా త్వరలో బాలీవుడ్‌కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందనేది ఆ న్యూస్ సారాంశం.


సారాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 మిలయన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఆమె పిక్స్ పెట్టిన వెంటనే అవి లక్షల్లో లైకులు, షేర్లతో వైరల్‌గా మారుతుంటాయి. అంతేకాకుండా చాలామంది ఈ భామని అప్పుడప్పుడు కాకుండా తరచుగా పిక్స్ అప్‌లోడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తుంటారు. ఈ తాజాగా వచ్చిన ఈ వార్తతో వారంతా ఖుషిగా ఉన్నారని టాక్. 24 ఏళ్ల సారా ఇటీవలే లండన్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌లో పట్టాపొందింది. అంతేకాకుండా ఇప్పటికే మోడల్‌గా రాణిస్తూ పలు యాడ్స్‌లో కూడా నటించింది. అందులో ఆమె నటనకి ఎంతోమంది షాక్ అవుతుంటారు. దీంతో ఈ స్టార్ కిడ్ బాలీవుడ్ ఎంట్రీపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.


నిజానికి.. గతంలోనే షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఓ సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయం కానుందని ప్రచారం జరిగింది. దీంతో సచిన్ రంగంలోకి దిగి తన కూతురు సారా సినిమాల్లో నటించట్లేదని క్లారిటీ ఇచ్చాడు. అవన్నీ వట్టి పుకార్లనీ కొట్టి పారేశాడు. అంతేకాకుండా సారా చదువుపై కాన్‌సన్‌ట్రేషన్ చేస్తోందని, తర్వాత ఏం చేస్తోందనేది ఆమె ఇష్టమని సచిన్ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ న్యూసైనా నిజమవుతుందా లేక రూమర్‌గానే మిగిలిపోతుందా చూడాలి.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement