Abn logo
Mar 26 2020 @ 04:29AM

గీత దాటారో అవుటే..!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన లాక్‌డౌన్‌ పిలుపునకు టీమిండియా క్రికెటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. స్పిన్నర్‌ అశ్విన్‌ లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే ఏమి జరుగుతుందో తనదైన సృజనాత్మకను జోడించి.. కరోనాపై అవగాహన పెంచే ప్రయత్నం చేశాడు. గత ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ చేసిన ఫొటోను ఈ సందర్భంగా పోస్టు చేశాడు. బంతి వేయక ముందే బట్లర్‌ క్రీజు వదలడంతో అశ్విన్‌ అతడిని అవుట్‌ చేశాడు. ఇంట్లోనే ఉండండి. ఒకవేళ గీత దాటారో వైరస్‌ దెబ్బకు అవుటై పోతారు అన్నట్టుగా వార్నింగ్‌ ఇచ్చాడు. 


Advertisement