వర్ణ వివక్షకు మేమూ బాధితులమే

ABN , First Publish Date - 2020-06-04T09:19:21+05:30 IST

క్రికెట్‌లో తాము ఎదుర్కొన్న వర్ణ వివక్ష గురించి భారత బ్యాట్స్‌మన్‌ అభినవ్‌ ముకుంద్‌, మాజీ పేసర్‌ దొడ్డ గణేష్‌ బయట పెట్టారు..

వర్ణ వివక్షకు మేమూ బాధితులమే

క్రికెటర్‌ అభినవ్‌ ముకుంద్‌, మాజీ పేసర్‌ గణేష్‌


న్యూఢిల్లీ: క్రికెట్‌లో తాము ఎదుర్కొన్న వర్ణ వివక్ష గురించి భారత బ్యాట్స్‌మన్‌ అభినవ్‌ ముకుంద్‌, మాజీ పేసర్‌ దొడ్డ గణేష్‌ బయట      పెట్టారు. వివక్షపై తమకెదు రైన అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘ఆటలో భాగంగా 15 ఏళ్ల వయసు నుంచే మన దేశంతోపాటు ప్రపంచమంతా తిరుగుతూనే ఉన్నా. ఎండలో ఆడడం వల్ల మరింత నల్లగా కనిపించే వాడిని. అయితే, నా శరీర వర్ణం గురించి అందరూ ప్రత్యేకంగా చర్చించుకునేవారు. ఎంతో మంది నన్ను అనేక విధాలుగా పిలిచేవారు. వాటిని పట్టించుకోకుండా నా లక్ష్యం దిశగా సాగిపోయా. సోషల్‌ మీడియాలో కూడా ఎన్నో అవమానకర సందేశాలు వచ్చినా.. స్పందించడం మానేశా’ అని మూడేళ్ల క్రితం తాను పెట్టిన ట్వీట్‌ను అభినవ్‌ తాజాగా రీట్వీట్‌ చేశాడు. తమిళనాడుకు చెందిన  30 ఏళ్ల ముకుంద్‌ జాతీయ జట్టు తరఫున 7 టెస్టులు ఆడాడు. తానాడే రోజుల్లో తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ కర్ణాటకకు చెందిన 46 ఏళ్ల గణేష్‌ చెప్పాడు. కానీ, వాటి నుంచి తాను మరింత బలంగా తయారయ్యానని ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-06-04T09:19:21+05:30 IST