క్రికెట్‌ బోర్డు ఆదేశం డికాక్‌ ధిక్కారం

ABN , First Publish Date - 2021-10-27T07:27:57+05:30 IST

దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ తన బోర్డు ఆదేశాన్ని ధిక్కరించాడు. వరల్డ్‌కప్‌లో మోకాలిపై నిలుచొని ‘బ్లాక్‌ లైవ్స్‌....

క్రికెట్‌ బోర్డు ఆదేశం డికాక్‌ ధిక్కారం

దుబాయ్‌: దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ తన బోర్డు ఆదేశాన్ని ధిక్కరించాడు. వరల్డ్‌కప్‌లో మోకాలిపై నిలుచొని ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలన్న క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎ్‌సఏ) సూచనకు ససేమిరా అన్నాడు. అంతేకాదు మంగళవారం నాటి మ్యాచ్‌ నుంచి తప్పుకొని జట్టుకు షాకిచ్చాడు.. ఇందుకు డికాక్‌ వ్యక్తిగత కారణాలు చూపాడు. డికాక్‌ చర్యకు ఆగ్రహించిన సీఎ్‌సఏ జట్టు మేనేజ్‌మెంట్‌ నుంచి నివేదిక కోరింది. దాని ఆధారంగా డికాక్‌పై తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే ఈ నిరసన తెలియజేసే విషయంలో డికాక్‌ గతంలోనూ అయిష్టత ప్రదర్శించేవాడు. ‘ఎవరి ఇష్టాలు వారివి. అంతేకానీ ఒకరిపై బలవంతంగా రుద్ద కూడదు’ అనేది అతడి అభిప్రాయం. ఈక్రమంలోనే అతడు తాజా నిరసనకు దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. 

Updated Date - 2021-10-27T07:27:57+05:30 IST