‘ది హండ్రెడ్‌’లో షఫాలీ

ABN , First Publish Date - 2021-05-11T09:13:51+05:30 IST

భారత మహిళల క్రికెట్‌ జట్టు టీనేజ్‌ సెన్సేషన్‌ షఫాలీ వర్మ తొలిసారి విదేశీ లీగ్‌లో ఆడబోతోంది. ప్రారంభ ‘ది హండ్రెడ్‌’ టోర్నమెంట్‌లో బర్మింగ్‌హామ్‌

‘ది హండ్రెడ్‌’లో షఫాలీ

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు టీనేజ్‌ సెన్సేషన్‌ షఫాలీ వర్మ తొలిసారి విదేశీ లీగ్‌లో ఆడబోతోంది. ప్రారంభ ‘ది హండ్రెడ్‌’ టోర్నమెంట్‌లో బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌ తరఫున షఫాలీ బరిలోకి దిగబోతోంది. మహిళల టీ20 క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ అయిన 17 ఏళ్ల షఫాలీ కివీ్‌సకు చెందిన సోఫీ డివైన్‌ స్థానంలో ఆ జట్టులో చోటు దక్కించుకుంది. అలాగే బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ ఫ్రాంచైజీ కూడా షఫాలీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ హండ్రెడ్‌ బాల్‌ టోర్నమెంట్‌లో భారత్‌ నుంచి హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ ఆడనున్నారు. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఈ టోర్నీ జూలై 21 నుంచి జరుగుతుంది.  

Updated Date - 2021-05-11T09:13:51+05:30 IST