టోనీ లూయిస్ ఇకలేరు..!

ABN , First Publish Date - 2020-04-03T04:14:15+05:30 IST

క్రికెట్ అభిమానులకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టోనీ లూయిస్(78) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 1997లో ఫ్రాంక్ డక్‌వర్త్‌తో కలసి టోనీ లూయిస్.. అంతర్జాతీయ

టోనీ లూయిస్ ఇకలేరు..!

లండన్: క్రికెట్ అభిమానులకు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ టోనీ లూయిస్(78) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 1997లో ఫ్రాంక్ డక్‌వర్త్‌తో కలసి టోనీ లూయిస్.. అంతర్జాతీయ క్రికెట్‌కు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని పరిచయం చేశారు. కాగా.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టోనీ లూయిస్ కన్నుమూశారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి అంతర్జాతీయ క్రికెట్ మండలి 1999లో ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ పద్ధతి మాత్రం 2004 నుంచి అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా వర్షం కారణంగా మ్యాచ్‌లు సగంలో ఆగిపోతే.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని ఉపయోగించి విజేతను ప్రకటిస్తారు. కాగా.. ఆయన మరణంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ సంతాపం వ్యక్తం చేయగా..  ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానలు విషాదంలో మునిగిపోయారు. 

Updated Date - 2020-04-03T04:14:15+05:30 IST