Abn logo
Aug 2 2020 @ 19:01PM

ఫ్రెండ్‌షిప్ డేకు సచిన్ సూపర్ కొటేషన్.. చదవాల్సిందే!

ముంబై: ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాము స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ఓ ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. అందులో తన చిన్ననాటి స్నేహితులతో కలిసి సచిన్ ఓ పార్క్‌లో ఆడుకుంటూ కనిపిస్తాడు. ఈ ఫోటోకు సచిన్ తన క్రికెట్ భాషలో ఓ అద్భుతమైన కొటేషన్‌ కూడా రాశారు. ‘స్నేహితులు క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ లాంటివారు. మైదానంలో ఉన్న మనం అద్భుతంగా ఆడుతున్నప్పుడు వారు ఒక మూల నుంచి చూస్తూ ఎంతో సంతోషపడతారు. అయితే మీపై నుంచి సూర్యుడి వెలుతురు పక్కకు వెళుతోందని తెలియగానే వారు మీపై తమ వెలుగును ప్రసరింపజేస్తారు. నా వరకు ప్రతి రోజూ ఫ్రెండ్‌షిప్‌ డేగానే భావిస్తానం’టూ సచిన్ పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫ్రెండ్‌షిప్ గురించి అద్భుతంగా చెప్పారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement