రంగంపల్లిలో క్రికెట్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-01-17T05:23:22+05:30 IST

రంగంపల్లిలో క్రికెట్‌ పోటీలు

రంగంపల్లిలో క్రికెట్‌ పోటీలు
విజేత టీంకు ట్రోఫీ అందజేస్తున్న నాయకులు, అధికారులు

పరిగి: క్రీడాపోటీలు స్నేహసంబంధాలను పెంపొందిస్తాయని పరిగి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, వైఎస్‌ ఎంపీపీ కె.స్యతనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకుడు కొప్పుల సురే్‌షచందర్‌రెడ్డి అన్నారు. రంగంపల్లిలో కొప్పుల రంగమ్మదొరసాని దేశ్‌ముఖ్‌ జ్ఞాపకార్థం వారి మనువడు కె.సురే్‌షచందర్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించారు. విజేతగా లయన్స్‌టీం,  రన్నర్‌గా వారియర్‌ టీంకు నగదు బహుమతులను ప్రదానం చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. దినచర్యలో క్రీడలను చేర్చుకోవాలన్నారు. దీంతో ఆరోగ్యకరంగా ఉండవచ్చన్నారు. క్రీడాకారులకు సహాయసహకారాలు అందిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు అనిల్‌రెడ్డి, సురే్‌షరెడ్డి, మధు, సర్పంచ్‌ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.


  • యాంకిలో కబడ్డీ పోటీలు

దౌల్తాబాద్‌: మండల పరిధిలోని యాంకి గ్రామంలో గ్రామస్థులు, యువకుల సహకారంతో కబడ్డీ పోటీలు నిర్వహించారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. పోటీల్లో వివిధ గ్రామాల క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు. గోకఫస్లాబాద్‌ జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంలో యాంకి జట్టు గెలుపొందింది. విజేతలకు జ్ఞాపికలు, మెడళ్లు, నగదు అందజేశారు. సర్పంచ్‌ ప్రవళికమాధవరెడ్డి, డాక్టర్‌ హన్మంతు మాట్లాడుతూ గ్రామస్థులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షనీయం అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో వెంకటయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, అంబయ్య, కళాకారులు అశోక్‌, పీఈటీలు శ్రీనివా్‌సచారి, నర్సిములు, సంజయ్‌, ఆరిఫ్‌, శేఖర్‌, కల్యాణ్‌, బందెప్ప, శివ, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T05:23:22+05:30 IST