శిక్షణకు రండి

ABN , First Publish Date - 2020-05-30T09:10:15+05:30 IST

తమ దేశంలో క్రికెట్‌ పునరాగమనానికి ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజాగా 55 మంది ఆటగాళ్లను ఎంపిక చేసి అవుట్‌ ..

శిక్షణకు రండి

క్రికెటర్లకు ఈసీబీ పిలుపు

లండన్‌: తమ దేశంలో క్రికెట్‌ పునరాగమనానికి ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజాగా 55 మంది ఆటగాళ్లను ఎంపిక చేసి అవుట్‌ డోర్‌ శిక్షణకు రావాలని కోరింది. ఈ జాబితాలో జో రూట్‌, బెయిర్‌స్టో, రాయ్‌, మోర్గాన్‌, స్టోక్స్‌, అండర్సన్‌, బ్రాడ్‌, ఆర్చర్‌ తదితర స్టార్‌ ఆటగాళ్లున్నారు. అయితే గతంలో 30 మంది ఆటగాళ్లను ఎంపిక చేయాలని భావించినా విండీ్‌సతో సిరీస్‌ ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్యను పెంచింది. మరోవైపు ఆటగాళ్ల ఆరోగ్య భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెడికల్‌ టీమ్‌తో, సదుపాయాల కోసం కౌంటీలతో ఈసీబీ చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే శిక్షణ ఆరంభమవుతుందని బోర్డు పేర్కొంది. 

Updated Date - 2020-05-30T09:10:15+05:30 IST