బెట్టింగ్‌.. హంటింగ్‌!

ABN , First Publish Date - 2022-05-04T16:40:22+05:30 IST

నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌ దందా జోరుగా సాగుతోంది. దీంతో పోలీసులు ముఠాల కోసం వేట కొనసాగిస్తున్నారు. తాజాగా రెండు ముఠాలకు చెందిన

బెట్టింగ్‌.. హంటింగ్‌!

ముఠాల ఆటకట్టిస్తున్న పోలీసులు 

హైదరాబాద్/రాంగోపాల్‌పేట్‌: నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌ దందా జోరుగా సాగుతోంది. దీంతో పోలీసులు ముఠాల కోసం వేట కొనసాగిస్తున్నారు. తాజాగా రెండు ముఠాలకు చెందిన సభ్యులను అరెస్ట్‌ చేశారు. కారులో తిరుగుతూ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాపై సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, రాంగోపాల్‌పేట్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను సెంట్రల్‌ జోన్‌ అదనపు డీసీపీ శ్రీనివా్‌సరెడ్డి, సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ సీఐ రఘునాథ్‌, రాంగోపాల్‌పేట్‌ సీఐ సైదులు వెల్లడించారు.


ఎనిమిదేళ్లుగా పీజీ రోడ్డు సింధీ కాలనీలో నివసిస్తున్న పడాల మహే్‌షబాబు(50), డీవీ కాలనీకి చెందిన శ్యాసుందర్‌ ముందాడా (42) అక్రమ మార్గంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆన్‌లైన్‌ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. వీరు ఒక దగ్గర ఉండకుండా కారులో పూర్తి సెటప్‌ పెట్టుకుని తిరుగుతూ బెట్టింగ్‌లను కొనసాగించేవారు. వీరికి సింధి కాలనీకి చెందిన పడాల జతిన్‌ (19), మహేందర్‌కుమార్‌ అగర్వాల్‌ (46), బేగంపేట్‌ ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీకి చెందిన మహమ్మద్‌ నవాజ్‌ఖాన్‌ (29), రాజస్థాన్‌కు చెందిన ఆనంద్‌ పారిక్‌ (24), ఈస్ట్‌ మారేడ్‌పల్లి నెహ్రూనగర్‌కు చెందిన నవీన్‌ (45), బాపుబాఘ్‌ కాలనీకి చెందిన గోవింద్‌ యాదవ్‌లు సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో దాడులు నిర్వహించి పట్టుకుని వారి నుంచి రూ.4.5 లక్షలు, కార్‌, 20 సెల్‌ఫోన్లు, లైన్‌కనెక్టర్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ బాక్స్‌, 2రికార్డర్లు, ల్యాప్‌ ట్యాప్‌, తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. గతం లో రెండు బెట్టింగ్‌ కేసులో మహేష్‌బాబు నిందితుడు.  


మరో కేసులో 

గుజరాత్‌కు చెందిన అమిత్‌ నిరంజన్‌ దోషి (48), గోవాలోని ఓ క్యాసినోలో పనిచేసి, ప్రస్తుతం మినిస్టర్‌రోడ్డులోని బాపూబా్‌ఘలో ఉంటున్నాడు. గత నాలుగేళ్లుగా బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇతను బెట్టింగ్‌ డాన్‌గా ఎదిగాడు. ఇతనికి నల్లగుట్ట గయోదిన్‌ బాఘ్‌ నివాసి బొజ్జ భూపాల్‌ యాదవ్‌ (43), హరియాణ రాష్ట్రం హిస్సార్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా (36), రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన ప్రవీణ్‌ సర్న (45), పిలి బంగాకు చెందిన యశ్‌కుమార్‌ అరోరా (20), సింధీ కాలనీకి  చెందిన అమిత్‌ నిరంజన్‌ దోషి (48) సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. ఆ మేరకు దాడులు నిర్వహించి వారి నుంచి రూ.15.65 లక్షలు, 23 సెల్‌ఫోన్లు, లైన్‌ కనెక్టర్‌ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Read more