అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న కుమార్తె పార్వతి
పాలకొల్లు రూరల్, మే 24: శివదేవుని చిక్కాల గ్రామానికి చెందిన పాలా పైడిశెట్టి(70) వడగాల్పులకు నీరసించి సోమ వారం రాత్రి మరణించాడు. పైౖడి శెట్టి ఏకైక కుమార్తె పార్వతికి వివాహమైంది. భర్తతో పాలకోడే రులో ఉంటోంది. తండ్రి మృతి చెం దడంతో మంగళవారం హిందూ స్మశానవాటికలో శాస్త్రబద్ధంగా అం త్యక్రియలు నిర్వహించింది. పైడిశెట్టి చితికి నిప్పు పెట్టింది.