చివరి మజిలీలో తిప్పలెన్నో..!

ABN , First Publish Date - 2022-09-15T05:05:06+05:30 IST

జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాల్లో సిద్ధాంతం ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత పొందింది.

చివరి మజిలీలో తిప్పలెన్నో..!
గోదావరి చెంత పందుల సంచారం

అధ్వానంగా సిద్ధాంతం కేదారిఘాట్‌


పెనుగొండ, సెప్టెంబరు 14: జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాల్లో సిద్ధాంతం ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత పొందింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన వశిష్ట నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహిస్తే పుణ్య గతులు ప్రాప్తి స్తాయని పలువురి నమ్మకం. సుమారు 20 గ్రామాల నుంచి మృతదేహా లను ఇక్కడికే తరలిస్తారు. జిల్లాలోని దూర ప్రాంతాల వారు కూడా చాలామంది ఈ ప్రాంతంలోరు అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రి యలు, కర్మకాండలు నిర్వహించే కేదారిఘాట్‌ అధ్వానంగా మారింది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మరిన్ని తిప్పలు తప్పడం లేదు. పుష్కర నిధులతో  నిర్మించిన విశ్రాంతి భవనంలో బురద పేరుకుపోయింది. గోదావరి తీరం చెత్త చెదారంతో పందులకు ఆవాసంగా మారాయి. సిద్ధాంతం గ్రామంలోని చెత్తను ఇక్కడే డంప్‌ చేయడంతో మరుభూమికి స్థలం లేక రేవులలో మెట్లపై స్నానమాచరించడానికి అగచాట్లు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చివరి మజిలీ ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



Updated Date - 2022-09-15T05:05:06+05:30 IST