గరిష్టస్థాయికి... ‘క్రెడిట్’...

ABN , First Publish Date - 2022-06-28T22:21:20+05:30 IST

క్రెడిట్ కార్డ్‌ల వ్యయం... కిందటి నెల(మే)లో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి(దాదాపు రూ. 1.14 ట్రిలియన్‌లు)కి చేరుకుంది.

గరిష్టస్థాయికి... ‘క్రెడిట్’...

‘ముంబై : క్రెడిట్ కార్డ్‌ల వ్యయం... కిందటి నెల(మే)లో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి(దాదాపు రూ. 1.14 ట్రిలియన్‌లు)కి చేరుకుంది. అంతకుముందు నెల(ఏప్రిల్‌)లో నెలవారీగా 8 శాతం వృద్ధిని నమోదు చేసింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తాజా డేటా ఈ వివరాలను వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన కార్డ్ ఖర్చులు 118 శాతం పెరిగాయి. కాగా...  బ్యాంకింగ్ వ్యవస్థ మేలో 1.7-మిలియన్ క్రెడిట్ కార్డ్ జోడింపులను చూసింది - ఇది 27 నెలల్లో అత్యధికమే కాకుండా, గత సంవత్సరం ఇదే నెలలో కంటే 23.2 శాతం ఎక్కువ. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల ద్వారా కార్డ్ జోడింపులు పెరిగాయి.


మే చేరికలతో... దేశం మొత్తంమీద కార్డ్ బేస్ ఇప్పుడు 76.9 మిలియన్లకు చేరుకుంది. ఇక... మే నెలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 38,500 కార్డులను జోడించగా, యాక్సిస్ బ్యాంక్(21,500), ఐసీఐసీఐ బ్యాంక్(21,200), ఎస్‌బీఐ కార్డ్(20,200) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. HDFC బ్యాంక్ డిసెంబరు 2020 నుండి ఎనిమిది నెలల పాటు కొత్త కార్డ్‌ల జారీపై RBI నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిషేధాన్ని ఎత్తివేసినప్పటి నుండి, దేశంలోని రెండవ అతిపెద్ద రుణదాత తన క్రెడిట్-కార్డ్ కస్టమర్ సంఖ్యను వేగంగా పెంచుకుంటూ వస్తోంది. కాగా...  HDFC బ్యాంక్, SBI కార్డ్ బలమైన కార్డ్ జోడింపులను కొనసాగిస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి.


మరోవైపు వ్యయాల్లో కూడా ‘భారీ ధోరణి’లనే చూసినట్లు నివేదికలు చెబుతున్నాయి. మాక్వేరీ రీసెర్చ్ ఈ వివరాలను వెల్లడించింది. ‘ఎక్కువ సంఖ్యలో కార్డ్‌లను జోడించినప్పటికీ, యాక్సిస్ ఖర్చు మార్కెట్ వాటాను కోల్పోతోంది. సిటీ ప్రతి నెలా ఖర్చు మార్కెట్ వాటాను క్రమంగా కోల్పోతోంది. యాక్సిస్ బ్యాంక్ ఒక్కో కార్డుకు ఖర్చు చేయడం పరిశ్రమ సగటు కంటే 30 శాతం తక్కువగా కొనసాగుతోంది, ఇది క్రెడిట్ కార్డ్ ఫ్రాంచైజీ నాణ్యతపై ఆందోళనలను పెంచుతుంది’ అని పేర్కొంది. భారత్ సహా పలు ఇతర మార్కెట్ల నుండి రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాల నుండి నిష్క్రమిస్తున్న సిటీ, క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్న యాక్సిస్ బ్యాంక్‌కు పోర్ట్‌ఫోలియోను విక్రయిస్తుందన్న విషయం తెలిసిందే. మే నెలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖర్చు మార్కెట్ వాటాపరంగా 27.7 శాతంతో ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ (19.2 శాతం), ఎస్‌బీఐ కార్డ్(18.7 శాతం) ఉన్నాయి. ఇదిలా ఉంటే... బౌన్స్ రేట్లు కూడా మూడేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నట్లు ఆర్‌బీఐ విడుదల చేసిన డేటా వెల్లడించింది. అయితేజ... వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభించినందున ఈ ధోరణులే స్థిరంగా ఉన్నాయో లేదో చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు సూచించారు. 

Updated Date - 2022-06-28T22:21:20+05:30 IST