Jul 1 2021 @ 01:05AM

అమ్మదే క్రెడిట్‌

ఇటీవలె విడుదలైన ‘షేర్ని’ (సివంగి) చిత్రంతో ఓటీటీలో ప్రేక్షకులను అలరించారు బాలీవుడ్‌ కథానాయిక విద్యాబాలన్‌. అందులో ఆమె ధైర్యవంతురాలైన అటవీ అధికారిణిగా కనిపించి ఆకట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘షేర్ని’ చిత్రంలో నా పాత్రను చూసి ధైర్యం వచ్చిందని చాలా మంది అమ్మాయిలు చెబుతున్నారు. అయితే నా జీవితంలోనూ ధైర్యాన్నిచ్చిన ఓ సివంగి ఉన్నారు. ఆమె మా అమ్మ. నేనూ, నా సోదరి మా కాళ్లమీద మేం నిలబడే ధైర్యాన్నిచ్చింది అమ్మే. నేను సాధించిన గొప్ప విషయాల అన్నింటికీ అమ్మ ఇచ్చిన మనోబలమే కారణం’’ అని అన్నారు. 


Bollywoodమరిన్ని...