Abn logo
Mar 7 2021 @ 06:50AM

క్రెడిట్‌కార్డు క్లోనింగ్‌ చేసి షాపింగ్‌

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : అంబర్‌పేట్‌కు చెందిన యువకుడి క్రెడిట్‌ కార్డును క్లోనింగ్‌ చేసిన సైబర్‌ కేటుగాళ్లు దేశరాజధాని ఢిల్లీలోని ఓ షాపింగ్‌మాల్‌లో స్వైప్‌ చేసి రూ.45వేలు మాయం చేశారు. సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట్‌కు చెందిన సంపత్‌ అనే యువకుడికి ఓ ప్రైవేట్‌బ్యాంక్‌ క్రెడిట్‌కార్డు ఉంది. రెండు రోజుల క్రితం రాత్రి తన క్రెడిట్‌కార్డు నుంచి రూ.45వేలు డెబిట్‌ అయినట్లు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. వెంటనే బ్యాంకు కష్టమర్‌ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదుచేశాడు. వారి నుంచి స్పందన లేకపోవడంతో శనివారం సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదుచేశాడు.

Advertisement
Advertisement
Advertisement