క్రెడిట్‌కార్డు యాక్టివేషన్‌ చేస్తానని 90వేలు కొట్టేశారు!

ABN , First Publish Date - 2021-04-16T18:32:21+05:30 IST

క్రెడిట్‌ కార్డు యాక్టివేషన్‌ చేస్తామని చెప్పి ఆన్‌లైన్‌లో

క్రెడిట్‌కార్డు యాక్టివేషన్‌ చేస్తానని 90వేలు కొట్టేశారు!

హైదరాబాద్/పేట్‌బషీరాబాద్‌ : క్రెడిట్‌ కార్డు యాక్టివేషన్‌ చేస్తామని చెప్పి ఆన్‌లైన్‌లో రూ.90వేలను సైబర్‌ నేరగాళ్లు కొట్టేశారు. జీడిమెట్ల సుచిత్ర సమీపంలోని మీనాక్షీ ఎస్టేట్‌లో నివాసముండే కందుకూరి సంపత్‌ కుమార్‌(35) కూరగాయల వ్యాపారి. ఇతడికి చార్టెడ్‌ బ్యాంక్‌ ఏటీఎం కార్డు ఉంది. ఈ నెల 14న ఓ వ్యక్తి ఫోన్‌చేసి మీ క్రెడిట్‌ కార్డు ఉపయోగంలో లేదని, యాక్టివేషన్‌ చేస్తానని చెప్పాడు. సంపత్‌కుమార్‌ ఫోన్‌కు ఓటీపీ పంపించాడు. అదే ఓటీపీని అతడికి పంపించగా సంపత్‌కుమార్‌ క్రెడిట్‌కార్డులో రూ.90వేలు డ్రా చేసినట్టు మెసేజ్‌ వచ్చింది. బాధితుడు పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-16T18:32:21+05:30 IST