Abn logo
Sep 21 2021 @ 01:25AM

వచ్చేనెల 9,10న క్రెడాయ్‌ ప్రొపర్టీ షో

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఎస్‌బీఐ డీజీఎం రంగరాజన్‌, క్రెడాయ్‌ ప్రతినిధులు

గుణదల, సెప్టెంబరు 20: సమాజంలోని ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నిజం చేయాలనే ఆలోచనతో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో అక్టోబరు 9, 10న నిర్వహించే ప్రాపర్టీ షోను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కె.రంగరాజన్‌ అన్నారు. క్రెడాయ్‌ విజయవాడ ఛాప్టర్‌ ఆద్వర్యంలో నిర్వహించే ప్రాపర్టీ షో బ్రోచర్‌ను ఆయన నగరంలోని ఓ హోటల్లో సోమవారం ఆవిష్కరించారు. నగరంలో మొదటి సారిగా క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను ప్రారంభించిందన్నారు. కొత్త తరహాలో ప్రాపర్టీ షో నిర్వహించడంలో క్రెడాయ్‌ ముందుంటుందన్నారు. క్రెడాయ్‌ విజయవాడ ఛాప్టర్‌ అధ్యక్షుడు కె.రాజేంద్ర మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆరు ప్రాపర్టీ షోలు విజయవంతంగా పూర్తిచేశామని తెలిపారు. అక్టోబరులో నిర్వహించే ప్రాపర్టీ షోలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, బిల్డర్లు బిల్డింగ్‌  మెటీరియల్‌ కంపెనీలు పాల్గొంటాయన్నారు. అవసరమైన వారికి రుణాలిచ్చేందుకు స్టేట్‌బ్యాంక్‌తోపాటు వివిధ బ్యాంకులు కూడా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాపర్టీ షో కన్వీనర్‌ రాంబాబు, క్రెడాయ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణరావు, విజయవాడ ఛాప్టర్‌ కోశాధికారి శ్రీధర్‌ పాల్గొన్నారు.