బ్రహ్మదేవంలో జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-06-30T03:14:37+05:30 IST

మండలంలోని బ్రహ్మదేవంలో బుధవారం జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలను మండల వైసీపీ కన్వీనర్‌ మెట్టా విష్ణువర్థన్‌రెడ్డి ప్రారంభించా

బ్రహ్మదేవంలో జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు
క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న వైసీపీ కన్వీనర్‌ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి

ముత్తుకూరు, జూన్‌29: మండలంలోని బ్రహ్మదేవంలో బుధవారం జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలను మండల వైసీపీ కన్వీనర్‌ మెట్టా విష్ణువర్థన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను పోత్సహించాలన్నారు. ఈ పోటీల్లో 30జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బందెల వెంకటసుబ్బయ్య, ఆలయ కమిటీ చైర్మన్‌ సుబ్రహ్మణ్యం, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ జమీల్‌, వైసీపీ నాయకులు అగ్ని మస్తాన్‌, షేక్‌ బషీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T03:14:37+05:30 IST