Abn logo
Aug 13 2020 @ 16:15PM

‘క్రియేటివ్ క్రిమినల్’ చిత్రం ప్రారంభం

కౌడిన్య ప్రొడక్షన్స్‌లో రెండో చిత్రంగా వస్తోన్న ‘క్రియేటివ్ క్రిమినల్’ చిత్రం ఆగస్ట్ 13న పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు కమెడియన్ సునీల్, పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నర్సింగ్ గౌడ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, తొలి షాట్‌కు సునీల్ క్లాప్ కొట్టారు. ఫస్ట్ షాట్‌కు పోసాని కృష్ణమురళి గౌరవ దర్శకత్వం వహించారు.


ఈ సందర్భంగా కమెడియన్ సునీల్ మాట్లాడుతూ.. ‘క్రియేటివ్ క్రిమినల్’ సినిమాలో ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల మంచి కథ రాసుకున్నాడు, ఈ మూవీ తప్పకుండా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను.. అన్నారు. 


పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత ఒక మంచి రోల్ చేయబోతున్నాను. కొత్త టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్‌తో తెరకెక్కబోతోన్న క్రియేటిక్ క్రిమినల్ సినిమాలో నటించబోతున్నందుకు సంతోషంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలిపారు.


నిర్మాత నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ.. కథ బాగా నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. మొదట చిన్న సినిమాగా చేయాలి అనుకున్నా కూడా కథను బట్టి బిగ్ స్కేల్‌లో ఈ సినిమా చేయబోతున్నాము. సునీల్‌గారు మా సినిమాలో మంచి రోల్ చేయబోతున్నారని అన్నారు.


డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘క్రియేటివ్ క్రిమినల్’ సినిమా. మంచి రోజు కావడంతో ఈ సినిమాను గురువారం ప్రారంభించాము. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు, ముఖ్యంగా నిర్మాత నర్సింగ్ గౌడ్‌గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సలీమ్ మాలిక్‌గారు మేము ఏది అడిగితే అది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలుగులో ఇప్పటి వరకు రాని కాన్సెప్ట్‌తో వస్తున్నాము. తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను.. అన్నారు.

Advertisement
Advertisement
Advertisement